ఈ జవానీ ఎన్నాళ్లయిన ఇలాగేనా?

0

హైదరాబాదీ అయినా కూడా బాలీవుడ్ లోనే ఎక్కువగా గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ టబు. ఈమె అయిదు పదుల వయసుకు కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే దూరంగా ఉంది. అయినా కూడా ఈమె ఫిజిక్ ఏమాత్రం అలా కనిపించదు. ఇంకా మూడు పదుల వయసు హీరోయిన్ గానే ఆమె కనిపిస్తూ ఉంటుంది. అందుకే ఈమెకు ఇంకా కూడా లేడీ ప్రాముఖ్యత ఉన్న సినిమాల్లో ఆఫర్లు వస్తున్నాయి. ఈమె హీరోయిన్ గా ఇంకా సినిమాలు వస్తూనే ఉన్నాయి.

తాజాగా ఈమె అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అల వైకుంఠపురంలో సినిమాలో కీలక పాత్రలో నటించాడు. ఈ చిత్రంను సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. టాలీవుడ్ లో ఈ చిత్రంతో టబు రీ ఎంట్రీ ఇవ్వబోతుంది. బాలీవుడ్ లో సినిమాలు చేస్తూనే తెలుగులో కూడా ఇలాంటి అమ్మ అత్త పాత్రలకు ఓకే చెప్పేందుకు సిద్దం అయ్యింది. ఆమె అమ్మగా అత్తగా నటించేందుకు ఒప్పుకుంటున్నా ఆమెను ఇంకా హీరోయిన్ గానే జనాలు చూస్తున్నారు.

ఈమె హిందీలో ‘జవానీ జానేమన్’ చిత్రంలో నటించింది. ఆ చిత్రంలో ఈమె పోషించిన పాత్ర ప్రస్తుతం బాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశం అవుతుంది. ఇటీవల జవానీ జానేమన్ చిత్రంలోని టబు లుక్ ను విడుదల చేయడం జరిగింది. చాలా రొమాంటిక్ గా మరియు ఎనర్జిటిక్ గా ఆ ఫస్ట్ లుక్ లో టబు కనిపిస్తుంది. ఈ పోస్టర్ లో టబును చూసిన అభిమానులు ఈ జవానీ ఎన్నాళ్లయినా ఇలాగే ఉంటుందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ చిత్రంతో మరోసారి టబు సక్సెస్ దక్కించుకుంటుందని అంతా అంటున్నారు. ఈనెల 31న జవానీ జానేమన్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Please Read Disclaimer