దత్ గారి `ప్రస్థానం` ఎమోషన్ ఎంత?

0

`దేవకట్టా` ప్రస్థానం 2010లో రిలీజైంది. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత ఇదే చిత్రాన్ని హిందీలో సంజయ్ దత్ ప్రధాన పాత్రలో రూపొందిస్తుండడం ఆసక్తికరం. ఇటీవలే దత్ సాబ్ బర్త్ డే సందర్భంగా టీజర్ ని రిలీజ్ చేశారు. ఈ టీజర్ కి అద్భుత స్పందన వచ్చింది. ఒరిజనల్ వెర్షన్ ని తెరకెక్కించిన దేవకట్టానే హిందీ వెర్షన్ కి దర్శకత్వం వహిస్తున్నారు కాబట్టి కచ్ఛితంగా అతడి మార్క్ ఎమోషన్ హైలైట్ గా ఉంటుందనే అంచనా వేస్తున్నారు. ఇక దేవకట్టా మార్క్ డైలాగులు వర్కవుటైతే హిందీ ఆడియెన్ కి ఈ చిత్రం సరికొత్త ట్రీట్ ఇస్తుందనడంలో సందేహం లేదు.

తెలుగు వెర్షన్ లో సాయికుమార్ పోషించిన పాత్రను హిందీలో సంజూ భాయ్ పోషిస్తున్నారు. అలీ ఫజల్- జాకీ ష్రాఫ్- చుంకీ పాండే- మనీషా కొయిరాలా- అమైరా దస్తూర్-సత్యజీత్ దూబే-ఖన్నా తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సంజయ్ దత్ – మాన్యతా దత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీలో తన లుక్ ఎలా ఉంటుందో తెలియజేసే పోస్టర్ ని సంజయ్ దత్ స్వయంగా ఇన్ స్టాగ్రమ్ లో అభిమానులకు షేర్ చేశారు. ఒరిజినల్ లో సాయికుమార్ లుక్ కి సిమ్మిలర్ గా అనిపించినా ఇది ఇంకాస్త రిచ్ కల్చర్ ని ఎలివేట్ చేస్తోంది. ఇక ఈ ఫోటోకి `ఎర్న్ ది లెగసీ..` అంటూ ఆసక్తికర కోట్ ని ఇచ్చారు దత్.

గుబురు గడ్డం.. తీక్షణమైన చూపులు.. నుదిటిన తిలకం ఇదంతా చూస్తుంటే ఉత్తరాదిన హిందూ కల్చర్ నుంచి వచ్చే నాయకుడి లక్షణం అతడిలో కనిపిస్తోంది. కశ్మీరీ హిందూ అంత పవిత్రంగా కనిపిస్తున్నాడు సంజూ భాయ్. జెమీందర్ కొలువు దీరినట్టు లావిష్ ఛైర్ లో కూచుని సిగార్ ని చేత్తో పట్టుకున్నాడు. అతడి ముందు బెంచ్ పై గన్ ఒకటి రెడీగా ఉంది. వైట్ అండ్ వైట్ పంచె- షరాయి.. పైన నల్లని కోట్ ఇదంతా ఉత్తరాది అల్ట్రా రిచ్ కల్చర్ కి సింబాలిక్ గా అనిపిస్తోంది. ఓవరాల్ గా సంజయ్ దత్ ఆ పాత్రకు సూటబుల్ అనడంలో సందేహం లేదు. ప్రస్థానం- హిందీ సెప్టెంబర్ 20న రిలీజ్ కానుంది. దత్ గారి ప్రస్థానంలో ఎమోషన్ ఎంతగా వర్కవుటైంది? అన్నదే విజయాన్ని నిర్ధేశిస్తుందనడంలో సందేహం లేదు.
Please Read Disclaimer