సాహో లో ప్రభాస్ వాడిన బ్లూటూత్ గురించి మీకు తెలియని సీక్రెట్స్!!

సోలో సోదర సోదరీమణులారా..!

0

వరుస ఫ్లాప్ ల తర్వాత చిత్రలహరి చిత్రంతో కాస్త ఊపిరి పీల్చుకున్న సాయి ధరమ్ తేజ్ కు ప్రతి రోజు పండుగే మరో సక్సెస్ గా నిలిచింది. అదే జోరుతో మరో విజయాన్ని దక్కించుకునేందుకు తేజూ ఉవ్విలూరుతున్నాడు. ప్రస్తుతం ఈయన సోలో బ్రతుకే సో బెటర్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంతో సుబ్బు అనే దర్శకుడు పరిచయం కాబోతున్నాడు. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై ఈ చిత్రాన్ని బివిఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు.

ఈ చిత్రాన్ని మే 1న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ ను రివీల్ చేయలేదు. ప్రేమికుల దినోత్సవం సందర్బంగా ఈ సినిమాకు సంబంధించిన థీమ్ వీడియోను విడుదల చేయబోతున్నట్లుగా సాయి ధరమ్ తేజ్ ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. ఇందుకోసం ఒక ప్రీ లుక్ ను కూడా పోస్ట్ చేశాడు.

ఈ పోస్టర్ లో సాయి ధరమ్ తేజ్ వెనుక వైపు నుండి కనిపిస్తూ పిడికిలి బిగించి ఒక ఉద్యమకారుడి మాదిరిగా ఉన్నాడు. పోస్టర్ చూస్తుంటే సినిమాలో ఇతడో పెద్ద ఉద్యమ నాయకుడిగా లేదంటే స్టూడెంట్ లీడర్ గా కనిపించబోతున్నాడని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కొందరు మాత్రం టైటిల్ ను బట్టి సోలో గా లైఫ్ ను లీడ్ చేసే వారికి నాయకుడి గా కనిపిస్తాడేమో అంటూ ఊహించేస్తున్నారు.

ఈ పోస్టర్ కు తేజ్ సోలో సోదర సోదరీ మణులారా.. ఈ వ్యాలెంటైన్స్ డే వీకెండ్ ను మనం అంతా కలిసి జరుపుకుందాం. మన నినాదం ఒక్కటే సోలో బ్రతుకే సో బెటర్ అంటూ ఫన్నీగా పోస్ట్ చేశాడు. ఈనెల 14వ తారీకున సినిమాకు సంబంధించిన థీమ్ వీడియో రాబోతుంది. ఆ వీడియోతో సినిమా ఏంటీ.. తేజ్ ఎలా కనిపించబోతున్నాడు అనే విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Please Read Disclaimer