ఫస్ట్ లుక్: సూపర్ మచ్చి అంటున్న మెగా హీరో

0

మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా ‘విజేత’ సినిమాతో పోయినేడాది టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న కళ్యాణ్ దేవ్ ఇప్పుడు పులి వాసు దర్శకత్వంలో తన రెండో సినిమాలో నటిస్తున్నాడు. దీపావళి పర్వదినం సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్- టైటిల్ పోస్టర్ విడుదల చేశారు. ‘సూపర్ మచ్చి’ అంటూ ఒక క్యాచీ టైటిల్ ను ఈ సినిమాకు ఫిక్స్ చేయడం విశేషం.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘S/o సత్యమూర్తి’ సినిమాలో చార్ట్ బస్టర్ సాంగ్ ‘సూపర్ మచ్చి’. దాన్నే ఈ సినిమాకు టైటిల్ గా ఎంచుకున్నారు. ఈ పోస్టర్ లో వానలో తడుస్తున్న కళ్యాణ్ దేవ్ చెయ్యి పైకెత్తి ఏదో సెలెబ్రేట్ చేసుకుంటూ హ్యాపీ మూడ్ లో ఉన్నాడు. కళ్యాణ్ దేవ్ కు ముందు ఓ డజన్ మంది అదే పోజులో కళ్యాణ్ కు జేజేలు తెలుపుతున్నారు. ఈ పోస్టర్ చాలా లైవ్లీగా ఉంది. కళ్యాణ్ దేవ్ లాంగ్ హెయిర్.. గడ్డంతో హ్యాండ్సం గా ఉన్నాడు. ఈ పోస్టర్ లోనే దీపావళి శుభాకాంక్షలు తెలపడంతో పాటుగా సమ్మర్ 2020 రిలీజ్ అని ప్రకటించారు.

ఈ సినిమాలో కళ్యాణ్ దేవ్ సరసన బాలీవుడ్ బ్యూటీ రియా చక్రవర్తి నటిస్తోంది. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.ఈ సినిమాను రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రిజ్వాన్ నిర్మిస్తున్నారు. మరి ఈ సినిమాతో కళ్యాణ్ దేవ్ కు మంచి బ్రేక్ దొరుకుతుందా అనేది వేచి చూడాలి.
Please Read Disclaimer