ఆకాశమే నీ హద్దురా అంటున్నాడు!

0

తమిళ స్టార్ హీరో సూర్యకు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది కానీ ఈమధ్య వరస ఫెయిల్యూర్లతో మార్కెట్ తగ్గిపోయింది. ముఖ్యంగా సూర్య లాస్ట్ సినిమాలు ‘NGK’.. ‘బందోబస్త్’ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇప్పుడున్న పరిస్థితిలో మంచి హిట్ పడితే కానీ సూర్య పోగొట్టుకున్న మార్కెట్ మళ్ళీ తిరిగిరాదు. సూర్య ప్రస్తుతం ‘సూరారై పొట్రు’ అనే తమిళ సినిమాలో నటిస్తున్నారు. సినిమాకు తెలుగులో ‘ఆకాశమే నీ హద్దురా’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ నిర్ణయించారు.

తాజాగా ఫిలిం యూనిట్ ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ‘గురు’ ఫేం సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఎయిర్ డెక్కన్ ఫౌండర్ జీ ఆర్ గోపీనాథ్ జీవితంలోని కొన్ని సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో టాలీవుడ్ సీనియర్ హీరో మోహన్ బాబు ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ విషయానికి వస్తే సూర్య షర్టు లేకుండా స్లీవ్ లెస్ టీ షర్టు..ప్యాంట్ ధరించి గాల్లో ఎగురుతూ ఉన్నారు. లైట్ గా గడ్డం పెంచి.. గాగుల్స్ ధరించి స్టైలిష్ గా కనిపిస్తున్నారు.

ఈ సినిమాలో అపర్ణ.. జాకీ ష్రాఫ్.. పరేష్ రావల్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంగీత దర్శకుడు జీ.వీ. ప్రకాష్. ఈ సినిమాను సూర్య 2D ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై స్వయంగా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Please Read Disclaimer