సాహో లో ప్రభాస్ వాడిన బ్లూటూత్ గురించి మీకు తెలియని సీక్రెట్స్!!

కబడ్డీ కోచ్ జ్వాలా రెడ్డి సీరియస్

0

ఎఫ్ 2 లాంటి బ్లాక్ బస్టర్ లో నటించిన మిల్కీ వైట్ బ్యూటీ .. అదే ఏడాది సైరా నరసింహారెడ్డి లాంటి భారీ పాన్ ఇండియా చిత్రంలో నటించి మెప్పించింది. నటన పరంగా మిల్కీ కి క్రిటిక్స్ ప్రశంసలు దక్కాయి. ఒక రకంగా సందిగ్ధంలో ఉన్న మిల్కీ కి 2019 బాగా కలిసొచ్చిన సంవత్సరం అనే చెప్పాలి. ప్రస్తుతం ఎగ్రెస్సివ్ హీరో గోపిచంద్ సరసన సీటీ మార్ చిత్రం లో కథానాయిక గా నటిస్తోంది.

సంపత్ నంది ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇంతకుముందు గోపిచంద్ ఫస్ట్ లుక్ రిలీజైంది. ఆ లుక్ కి ఫ్యాన్స్ లో చక్కని స్పందన వచ్చింది. తాజాగా మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా లుక్ ని రిలీజ్ చేశారు. ఆరెంజ్ కలర్ స్పోర్ట్స్ డ్రెస్ తొడుక్కుని చెవిలో హెడ్ ఫోన్స్ పెట్టుకుని పక్కా క్రీడాకారిణిలా కనిపించింది మిల్కీ. ఇందులో జ్వాలా రెడ్డి అనే కబడ్డీ కోచ్ పాత్రలో మిల్కీ నటిస్తోంది. అయితే ఆ సీరియస్ ఎక్స్ ప్రెషన్ దేనికి? తనని ఏడిపిస్తున్న ప్రత్యర్థి కోచ్ గోపీచంద్ పైనే ఇంత సీరియస్ అయ్యిందా? అన్నది సినిమా చూసి చెప్పాల్సిందే.

గోపిచంద్ – సంపత్ నంది కలయికలో మూడో చిత్రమిది. సీటీమార్ తో ఎట్టి పరిస్థితిలో బ్లాక్ బస్టర్ కొట్టాలన్న పంతం ఆ ఇద్దరి లో కనిపిస్తోందట. ఇక ఈ చిత్రంలో గోపిచంద్ – తమన్నా మధ్య సన్నివేశాలు హైలైట్ గా ఉండనున్నాయని చెబుతున్నారు. ఇదే చిత్రంలో హిప్పీ ఫేం దిగంగన సూర్యవంశీ- భూమిక కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకం పై తెరకెక్కుతోంది.
Please Read Disclaimer