ఫస్ట్ లుక్ తో మెప్పించిన రెండవ డిటెక్టివ్

0

తమిళం తో పాటు తెలుగు లో కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డిటెక్టివ్ చిత్రానికి సీక్వెల్ గా థప్పరివాలన్ అనే చిత్రం తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. డిటెక్టివ్ కు దర్శకత్వం వహించిన మైస్కిన్ ఈ సీక్వెల్ కు దర్శకత్వ బాధ్యతలు స్వీకరించాడు. అయితే సినిమా సగం పూర్తి అయిన తర్వాత ఏవో కారణాల వల్ల మైస్కిన్ సినిమా నుండి తప్పుకున్నాడు. దాంతో విశాల్ స్వయంగా సినిమా దర్శకత్వ బాధ్యతలు నెత్తిన వేసుకున్నాడు.

థప్పరివాలన్ సినిమాను స్వీయ దర్శకత్వం లో విశాల్ నిర్మిస్తున్నాడు. షూటింగ్ ముగింపు దశకు వచ్చిన నేపథ్యంలో ఫస్ట్ లుక్ ను విశాల్ రివీల్ చేశాడు. ఫస్ట్ లుక్ తో విశాల్ ఆకట్టుకున్నాడు. విభిన్నమైన గెటప్ లో క్యాప్ తో సగం ఫేస్ ను కవర్ చేస్తూ ఫస్ట్ లుక్ స్టిల్ లో విశాల్ మెప్పించాడు. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే సినిమా లండన్ బ్యాక్ డ్రాప్ లో ఎక్కువగా సాగుతుందనిపిస్తుంది. విశాల్ ఫస్ట్ లుక్ తో ఈ చిత్రంపై చాలా అంచనాలు ఇంకా ఆసక్తి పెంచుతున్నాడు.

ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని అందిస్తున్నాడు. ప్రముఖ తమిళ నటుడు ప్రసన్న కీలక పాత్రలో నటిస్తున్నాడు. దర్శకుడు మైస్కిన్ మద్యలో వెళ్లి పోయిన నేపథ్యంలో ఆమద్య సినిమా గురించి ప్రముఖంగా చర్చ జరిగింది. సినిమాను విశాల్ ఎలా పూర్తి చేసి ఉంటాడా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జూన్ లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు దర్శక నిర్మాత కమ్ హీరో అయిన విశాల్ ప్రయత్నాలు చేస్తున్నాడు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-