సుకుమార్ ఫస్ట్ ఎగ్జామ్ పాస్ అయ్యాడు

0

ఆ మధ్య మహేష్ బాబుతో సినిమా చేసే విషయంలో పూర్తిగా బయటకు కనిపించని కారణాల వల్ల మిస్ చేసుకున్న సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ స్క్రిప్ట్ మీద సీరియస్ గా వర్క్ చేస్తున్న సంగతి తెలిసిందే. లైన్ గతంలోనే ఓకే అయ్యింది కానీ ఫుల్ నెరేషన్ మాత్రం ఇంకా ఇవ్వలేదు. ఇటీవలే ఫస్ట్ హాఫ్ తాలూకు కంప్లీట్ వెర్షన్ అల్లు అర్జున్ కు సుకుమార్ వినిపించాడట. పూర్తి సంతృప్తి వ్యక్తం చేసిన బన్నీ ఇది లాక్ చేసుకుని సెకండ్ హాఫ్ ని కూడా వీలైనంత త్వరగా ఫినిష్ చేస్తే షూటింగ్ ఫిక్స్ చేయడం గురించి మాట్లాడుకుందామని చెప్పినట్టు వినికిడి.

దీని కోసమే సుకుమార్ తన రైటింగ్ టీమ్ మొత్తాన్ని గోవా తీసుకెళ్ళాడట. ఇంకో రెండు మూడు నెలల్లో పూర్తి చేసి పక్కా బౌండ్ స్క్రిప్ట్ ని రెడీ చేయబోతున్నట్టు సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందే ఈ మూవీ షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందో ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి అయితే ఉంది. మరోవైపు వేణు శ్రీరామ్ తన ఐకాన్ స్క్రిప్ట్ తో రెడీగా ఉన్నాడు. త్రివిక్రమ్ సినిమా పూర్తవ్వడం ఆలస్యం ఈ ఇద్దరిలో ఒకరిది వెంటనే సెట్స్ పైకి వెళ్తుంది.

ఎవరు అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. సీనియారిటీ ప్రకారం ఛాయస్ ప్రకారం సుకుమార్ ముందు ఉండొచ్చు కాని స్క్రిప్ట్ ఫైనల్ గా లాక్ అయితేనే జరుగుతుంది. వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానున్న త్రివిక్రమ్ మూవీకి ఇంకా టైటిల్ డిసైడ్ చేయలేదు. పూజా హెగ్డే హీరొయిన్ గా టబు జయరాం నవదీప్ సుశాంత్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ మూవీపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి
Please Read Disclaimer