అతను చెడ్డవాడు కాదు.. అలాగని అందరిలాంటి వ్యక్తి కాదు : ప్రకాష్ రాజ్

0

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల ”పవర్ స్టార్” అనే సినిమా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఎలక్షన్స్ లో ఓడిపోయిన తరువాత పరిస్థితులు ఎలా ఉన్నాయో అని ఊహించి వర్మ రూపొందించిన ఈ సినిమా అనేక వివాదాల మధ్య విడుదలైంది. సినిమా విడుదలకు ముందు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆర్జీవీ ఆఫీస్ పై దాడి కూడా చేసారు. సినిమా చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ అభిమానులు సైతం ఆర్జీవీ పై పాజిటిన్ కామెంట్స్ చేశారు. ఎందుకంటే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ని ఫ్యూచర్ సీఎం మీరే అంటూ పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేసారు వర్మ. అయితే కొంతమంది మాత్రం పవన్ కళ్యాణ్ ని కించపరిచేలా క్యారక్టర్ డిజైన్ చేసారని ఫైర్ అవుతూనే ఉన్నారు. సినీ ప్రముఖులు సైతం రామ్ గోపాల్ వర్మని ఉద్దేశిస్తూ పరోక్షంగా ట్వీట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘పవర్ స్టార్’ వివాదంపై విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.

ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. రామ్ గోపాల్ వర్మతో నేను ఎక్కువగా వర్క్ చేసింది లేదు. కానీ పర్సనల్ గా చాలా సార్లు కలిశాను. ఆయనకున్న తెలివి విజ్ఞానం నిజంగా చాలా గొప్పది. ఆయన ఏం మాట్లాడారు అనేది నేను చూడను.. ఆయన నుంచి ఏమి నేర్చుకోవచ్చు.. ఆయనతో ఎలాంటి విషయాలు షేర్ చేసుకోవాలి అని మాత్రమే ఆలోచిస్తానని చెప్పుకొచ్చారు. వర్మ చెడ్డవాడు కాదు.. అలాగని అందరిలాంటి మనిషి కాదు.. ఒక విచిత్రమైన వ్యక్తి. పవర్ స్టార్ సినిమాతో ఏదో చెప్పాలని అనుకున్నారు. ఎవరికైనా వారి భావాన్ని తెలిపే హక్కు ఉంది. నచ్చకపోతే వదిలేయవచ్చు. మనం బలవంతంగా తొంగి చూడాల్సిన అవసరం లేదు. కానీ అతను లిమిట్స్ లో ఉంటాడని అనుకుంటున్నానని పేర్కొన్నారు. అంతేకాకుండా ‘పవన్ కళ్యాణ్ ఏమిటో అందరికి తెలుసు. ఒక రామ్ గోపాల్ వర్మ తప్పుగా చూపించినా లేకపోతే మరొకరు ఇంకేదో అన్నా కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నాకు తెలిసి ఇలాంటి వాటి వల్ల పవన్ కళ్యాణ్ రేంజ్ అయితే ఏ మాత్రం తగ్గదు. వర్మను అలా వదిలేయండి. పవన్ ఫ్యాన్స్ కూడా వర్మపై సినిమా తీస్తున్నారని విన్నాను. అలాంటి పోటీ ఉండడం నిజంగా మంచిదే అని ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చారు.