ఐదు సినిమాల కసి ఒకేసారి తీరుతుందట

0

ఒకే ఒక్క వెబ్ సిరీస్ తో ఐదు సినిమాల కసి తీర్చుకోవచ్చని కచ్ఛితంగా చెబుతోంది మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా. ఈ అమ్మడు ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్ కి సంతకం చేసింది. `ది నవంబర్ స్టోరి` అనేది టైటిల్. ఇది తండ్రి కూతుళ్ల మధ్య సాగే ఆసక్తికర డ్రామాతో తెరకెక్కనుంది. దుర్మార్గుడు హంతకుడు అయిన తండ్రి (జీఎం కుమార్) వల్ల కూతురు పడే పాట్లు ఏమిటన్నది తెరపై చూపిస్తారట. తండ్రిని కాచుకునేందుకు సన్నివేశాల్ని ఆ కూతురు ఎలా డీల్ చేస్తుందో చూడొచ్చట.

ఈ వెబ్ సిరీస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ఆ మేరకు ఇప్పటికే మిల్కీ బ్యూటీ ఒప్పందం కుదుర్చుకుందని తెలుస్తోంది. రామ్ సుబ్రమణియన్ దీనికి దర్శకత్వంలో వికటన్ గ్రూప్ ఈ వెబ్ సిరీస్ ని నిర్మిస్తోంది. తెలుగు తమిళ్ రెండు భాషల్లోనూ దీనిని తెరకెక్కించనున్నారు. ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఇతర నాయికల్లానే ఓటీటీ వేదికకు వస్తున్న తమన్నా .. ఇక్కడ బంగారు భవిష్యత్ ఉంటుందని నిరూపించుకునేందుకు ఎక్కువ స్కోప్ ఉందని తెలిపింది. ఐదు సినిమాల్లో నటించినంత అనుభవం ఒకే వెబ్ సిరీస్ తో సాధ్యమని నమ్మకం వ్యక్తం చేసింది. ట్యాలెంటును లోతుగా ఆవిష్కరించేందుకు.. ప్రేక్షకాభిమానుల నుంచి మెప్పు పొందేందుకు ఓటీటీ వేదిక ఎక్కువ స్కోప్ నిస్తుందని వెల్లడించింది. ఇలాంటి మరిన్ని వెబ్ సిరీస్ లలో నటించేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించింది.
Please Read Disclaimer