శివ కార్తికేయన్ కి ఇన్ని క్యామియోలా

0

హీరొయిన్ గా కెరీర్ మొదలుపెట్టి దశాబ్దం దాటినా ఇంకా ఫుల్ స్వింగ్ లో ఉన్న నయనతార కొత్త సినిమా మిస్టర్ లోకల్ వచ్చే నెల 1 విడుదలకు రెడీ అవుతోంది. శివ కార్తికేయన్ హీరోగా నటించిన ఈ మూవీ మీద కోలీవుడ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. మన దగ్గర ఇతగాడు నటించిన రెమో-సీమ రాజా లాంటివి కనీస స్థాయిలో ఆడలేదు కాని అక్కడ మంచి మార్కెట్టే ఉంది.

ఇతనితో సమానంగా నయన్ బ్రాండ్ ని చూపించి సినిమా బిజినెస్ చేసుకుంటున్నారు. తెలుగు వెర్షన్ డబ్ చేసే ఆలోచన ఉంది కాని అదే తేదికి ఇక్కడా వస్తుందా రాదా అనేది అనుమానమే. ఇకపోతే ఇందులో ఒకరు ఇద్దరు కాదు ఏకంగా ఐదుగురు హీరోలు క్యామియోలు చేయడం విశేషం.

కార్తి-ఆర్య-జీవా-జివి ప్రకాష్-ఉదయనిధి స్టాలిన్ ఇందులో క్యామియోలలో మెరవబోతున్నారు. దానికి కారణం లేకపోలేదు. మిస్టర్ లోకల్ దర్శకుడు రాజేష్ తో వీళ్ళంతా ఇంతకు ముందు సినిమాలు చేసినవాళ్ళే. ఆ బాండింగ్ తో ఇందులో కనిపించేందుకు ఒప్పుకున్నారు. అయితే అందరూ ఒకే సందర్భంలో కనిపిస్తారా లేక వేరు వేరు సీన్స్ లో ఉంటారా అనే విషయం మాత్రం సస్పెన్స్.

లోకల్ కుర్రాడు బాగా డబ్బున్న అమ్మాయిల మధ్య లవ్ థీమ్ తో ఇంచుమించు మన ఘరానా మొగుడు లైన్ మీద సాగే మిస్టర్ లోకల్ ఈ హీరో హీరొయిన్ల కాంబోలో వస్తున్న మూడో సినిమా. ఒకవేళ తెలుగులోకి తేవాలి అంటే నయన్ పేరు మీదే అమ్మాలి. చూడాలి ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుందో.
Please Read Disclaimer