బన్నీపై ఈ ఫ్లెక్సీ ఉద్ధేశ్యమేమిటో?

0

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని ఉద్దేశించి గుర్తు తెలియని వ్యక్తులు ఆయన గురించి ఓ నెగిటివ్ ఫ్లెక్సీని డిజైన్ చేసి సోషల్ మీడియాలోకి రిలీజ్ చేయడం కలకలం సృష్టిస్తోంది. “తెలుగు సినీ ప్రేక్షకులు ఇతనిని హీరోగా పోషిస్తున్నారు కానీ ఇతను మాత్రం కార్మికులు పొట్ట కొడుతున్నాడు ఎందుకుకని?“ అంటూ ఆ ఫ్లెక్సీలో ప్రశ్నించారు. పోస్టర్ దిగువన తెలుగు సినీ కార్మికుల ఐక్యత వర్ధిలాల్లి అని రాసి ఉంది. దీంతో ఈ పని ఎవరు చేసి ఉంటారు? అన్నది సస్పెన్స్ గా మారింది. బన్ని వ్యతిరేక వర్గం ఇలా నెగిటివ్ ప్రచారం చేస్తోందా? లేక తెలుగు సినీ కార్మిక సంఘాలా పనేనా? లేక వీళ్లిద్దరినీ ఇరికించే ప్రయత్నంలో మరో వర్గం ఇలా తెగబడిందా? అన్నది తేలాల్సి ఉంది.

ఈ పోస్టర్ ను బన్నీ ఫ్యాన్స్ చూసి ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఎవరో కావాలనే పనిగట్టుకుని మా హీరోని ఇలా బ్యాడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బన్నీని- కార్మికుల సంఘాల్ని ఉద్దేశించి అలా రాసి బహిరంగంగానే ఫ్లెక్సీ పెట్టారంటే దీని వెనుక ఏదో తెలుసుకు తీరాల్సిన గూడు పుటానీ ఉండే ఉంటుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

దీనివెనక ఇంకెవరైనా పెద్ద హ్యాండు ఉండి ఉండొచ్చేమో! అంటూ సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయినా అంత అవసరం ఎవరికి వచ్చింది? అంటూ బన్ని అభిమాన సంఘాలు ఆరాలు తీస్తున్నాయి. ఈ పనికి తెగబడింది ఎవరో తేలాల్సిందేనన్న పట్టుదల కనిపిస్తోందట. సాధారణంగా బన్ని వివాదాలకు దూరంగా ఉండే హీరో.. సౌమ్యుడు.. ఆలోచనా పరుడు. వ్యక్తిత్వ పరంగా మరీ అంత ఇరుకు మెంటాలిటీ కాదని అంటారు. ఒకరికి హాని చేసే స్వభావం తనకు లేదు. వీలైతే సహాయం చేసే గుణం కలవాడు గానీ.. ఒకరి పొట్ట కొట్టే వ్యక్తిత్వం కానే కాదని ఆయన అభిమానులు చెబుతున్నారు. బన్ని చుట్టూ వాతావరణం ఎప్పుడూ హెల్దీ గా ఉంటుందని.. అందరితో కలివిడిగా మాట్లాడుతాడని స్టార్ అనే స్టేటస్ ని ఎక్కడా చూపించరని తన గురించి తెలిసిన వారు చెబుతున్నారు. మరి బన్నీని టార్గెట్ చేసింది ఎవరో?.. కొద్ది రోజులు ఆగితే గానీ క్లారిటీ రాదు.
Please Read Disclaimer