అనుష్క కు ఫ్లయింగ్‌ కిస్‌లు

0
viratkohli-kiss-anushkaఉప్పల్‌లో భారత్‌, శ్రీలంక మూడో వన్డేకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మరో విశిష్ట అతిథి వచ్చారు. అది మరెవరో కాదు.. విరాట్‌ కోహ్లి ప్రేయసి, బాలీవుడ్‌ నటి అనుష్క శర్మ. కొన్నాళ్లుగా కోహ్లితో కలిసి అందరికీ తెలిసేలా చెట్టాపట్టాలేసుకు తిరిగేస్తున్న అనుష్క.. ఆదివారం మ్యాచ్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్టాండ్స్‌లో కూర్చుని శ్రద్ధగా మ్యాచ్‌ చూసిన అనుష్క.. కోహ్లి షాట్లు ఆడినపుడల్లా కేరింతలు కొట్టింది. చతురంగ డిసిల్వా బౌలింగ్‌లో కోహ్లి సిక్సర్‌ బాది అర్ధసెంచరీతో పాటు వన్డేల్లో అత్యంత వేగంగా 6 వేల మైలురాయి దాటిన ఆటగాడిగా రికార్డు అందుకున్న సమయంలో అనుష్క లేచి నిలబడి చప్పట్లతో అతణ్ని అభినందించింది. ఆ సమయంలో విరాట్‌ కూడా అనుష్కను మరిచిపోలేదు. అనుష్క వైపు బ్యాటు చూపిస్తూ.. ఫ్లయింగ్‌ కిస్‌ కూడా ఇచ్చాడు.
ఇక దాపరికాలేమీ లేవు.. ప్రేమికులిద్దరూ బయటపడిపోయారు.. కలిసి స్టేడియానికి వచ్చేశారు! మ్యాచ్‌కు టీమ్‌ఇండియా స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి, బాలీవుడ్‌ నటి అనుష్క శర్మ కలిసి హాజరయ్యారు. కొన్నాళ్లుగా ప్రేమలో మునిగి తేలుతున్న వీళ్లిద్దరూ.. చాటుమాటుగా కలుసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్‌ పర్యటనకు అనుష్క వెంట తీసుకెళ్లేందుకు బీసీసీఐ నుంచి ప్రత్యేక అనుమతి కూడా సంపాదించాడు కోహ్లి. ఆ పర్యటనలో విరాట్‌ విఫలమవడానికి అనుష్కే కారణమన్న విమర్శలు కూడా వినిపించాయి. ఆ సంగతలా ఉంటే ఈ మధ్యే ముంబయిలోని ఓ హాస్పిటల్లో మీడియా కెమెరాలకు చిక్కిన విరాట్‌, అనుష్క.. ఆదివారం ఏకంగా స్టేడియానికే కలిసొచ్చారు. ఈ ప్రేమ జంట అందరికీ తెలిసేలా కనిపించడమిదే తొలిసారి. విరాట్‌ తాను సహ యజమానిగా ఉన్న గోవా ఎఫ్‌సీ టీషర్టు ధరించి మ్యాచ్‌కు రాగా.. అనుష్క కూడా అదే జెర్సీ వేసుకుంది. పుణెతో జరిగిన ఈ మ్యాచ్‌లో తన జట్టు ఓడిపోతుండటంతో కోహ్లి కాస్త కంగారుగా కనిపించాడు. అనుష్క మాత్రం సరదాగా గడిపింది. ఇటీవలే కోహ్లి, అనుష్క కుటుంబాలు ముంబయిలో కలుసుకున్న నేపథ్యంలో వీళ్లిద్దరూ పెళ్లి పీటలెక్కవచ్చని.. ఆ నేపథ్యంలో బహిరంగంగా ఇలా కలుసుకున్నారని ప్రచారం జరుగుతోంది.Please Read Disclaimer