రావొద్దంటున్నా గెస్ట్ హౌస్ కి వస్తానంటోంది!

0

టాలీవుడ్ లో అవకాశాల కోసం ఎంతకైనా వెళ్లాల్సిన పరిస్థితి. ఆ నటి రావొద్దంటున్నా గెస్ట్ హౌస్ కి రావడానికైనా రెడీ అంటోందట. దర్శకనిర్మాతలు ఎవరు పిలిచినా కాదని అనడం లేదు. అయితే వద్దు అంటున్నా తాను మాత్రం వచ్చేస్తా! అంటూ వెంట పడుతుండడమే విడ్డూరం. అయితే ఇక్కడే ఉందో ట్విస్టు. గెస్ట్ హౌస్ కి వస్తే తనకు తప్పనిసరిగా సినిమాలో ఛాన్స్ ఇవ్వాల్సిందే. అదేరోజు అడ్వాన్స్ చేతిలో పడాల్సిందేనని కండీషన్ అట..

అయితే ఇలాంటి వారిని ఉద్ధేశించి అప్పట్లో ఓ అందాల కథానాయిక.. ఓ సీనియర్ దర్శకనిర్మాత సైతం ఘాటైన కౌంటర్లు వేసిన సంగతి తెలిసిందే. అసలు అమ్మాయిలు గెస్ట్ హౌస్ లకు వెళ్లాల్సిన అవసరం ఏమిటి? అవకాశం కావాలంటే ఆఫీసులకు వెళ్లి ఫోటోలు ఇవ్వాలి కానీ! అంటూ అతడు స్ట్రాంగ్ గానే కౌంటర్ ఇచ్చాడు. ఇక వేరొక అందాల నటి అయితే .. తప్పు అమ్మాయిలదే ఉంటుంది. అందుకే అబ్బాయిలు చొరవ తీసుకుంటారు! అంటూ ఉన్న నిజం చెప్పింది. అంతేకాదు అమ్మాయి అందంగా ఉంటే ఈ రంగంలో ప్రమాదమే కాబట్టి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.

మరి ఈ రెండు రియల్ ఎగ్జాంపుల్స్ ని బట్టి అసలు మీటూ ఉద్యమం అన్నది ఎందుకు? రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు .. ముందు గెస్ట్ హౌస్ లకు వెళ్లి.. ఆనక తీరిగ్గా సమయం చూసుకుని ఐదు పదేళ్ల గ్యాప్ తర్వాత నాపై వేధింపులకు పాల్పడ్డాడు.. బలవంతం చేశాడు! అని హీరోలు.. దర్శకనిర్మాతలపై అరవడం వల్ల ఉపయోగమేంటి? అంటూ ఫిలింనగర్ వర్గాల్లోనే గుసగుస మొదలైంది. పైగా తమపై వేధింపులు ఎదురైన రోజే పోలీసులకు ఫిర్యాదు చేయకుండా సద్దికాలం ముగిశాక సతాయించుడేమిటి? అంటూ పంచ్ లు వేస్తున్నారు. అయినా సదరు నటి వద్దు మొర్రో అంటే గెస్ట్ హౌస్ కి వెళ్లడమేమిటి? కేవలం అడ్వాన్స్ చెక్ కోసం.. ఆఫర్ కోసం ఇంతకు దిగజారాలా?! అంటూ ఛీ కొడుతున్నారు మరి.
Please Read Disclaimer