అత్యాచారాలకు ఇస్మార్ట్ హీరోయిన్ కారణమట!

0

ఈ సమాజంలో చాలామందికి చాలా అభిప్రాయాలు ఉంటాయి. అవి మంచివి.. చెడ్డవి.. పిచ్చవి.. ఉన్మదమైనవి ఎలాంటివినా కావొచ్చు. ఒక్కోసారి అవి పక్కవారికి ఇబ్బంది కలిగిస్తాయి. రీసెంట్ గా హీరోయిన్ నిధి అగర్వాల్ కు ఇలాంటి సందర్భమే ఎదురైంది. ఒక నెటిజన్ నిధి అగర్వాల్ పై పెద్ద అభాండం వేసి అందరికీ షాక్ ఇచ్చాడు.

హీరోయిన్లు సోషల్ మీడియాలో హాట్ ఫోటోలు పోస్ట్ చెయ్యడం చాలా సాధారణం. అలానే నిధి కూడా తన ట్విట్టర్ ఖాతా దారా ఒక హాట్ ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు సాధారణ నెటిజన్లు సాధారణంగా స్పందించారు. అయితే ఒక నెటిజన్ మాత్రం “నీలాంటి వారివల్లే మహిళలు అత్యాచారాలకు గురవుతున్నారు. దయచేసి ఇలా హాట్ గా కనిపించొద్దు” అంటూ కామెంట్ పెట్టాడు. ప్రస్తుతం భారతదేశమంతా అత్యాచారాల గురించి చర్చ సాగుతోంది. జనాలు ఎమోషనల్ గా ఉన్నారు. ఎవరికి తోచిన పరిష్కార మార్గాలు వారు చెప్తున్నారు. ఈ నెటిజన్ తన స్థాయిని బట్టి ఒక పరిష్కార మార్గం చెప్పాడు. అయితే ఇది మోకాలికి బోడిగుండుకి లంకె పెట్టడం లాంటిదని ఎక్కువ మంది అభిప్రాయం.

ఈ కామెంట్ తో నిధికి చిర్రెత్తిపోయింది. “ఈ వ్యక్తి దారుణమైన ఆలోచన విధానానికి నేను షాక్ కు గురయ్యాను. నరేష్ మీ అడ్రెస్ పంపండి. పింక్ అనే సినిమాను మీకు పంపుతాను.. మీకు చాలా అవసరం” అంటూ గట్టిగా బుద్ధి చెప్పింది. నిధి ఇచ్చిన జవాబుకు చాలామంది నెటిజన్ల నుండి మద్దతు లభించింది. ఒకరైతే “రేపులు చేసే మానవ మృగాలు కొందరే. వారు ఈ ఫోటోలు చూసినా చేస్తారు.. చూడకపోయినా చేస్తారు. ఎందుకంటే వారు మనిషి రూపంలో ఉండే మృగాలు. ఈ ఫోటోల వల్ల రేపులు జరగవు” అంటూ గట్టిగా పంచ్ ఇచ్చారు.
Please Read Disclaimer