ఆ విషయాలు మర్చిపోండి: అనసూయ

0

విజయ్ దేవరకొండ నిర్మిస్తున్న ‘మీకు మాత్రమే చెప్తా’ నవంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది. డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. అనసూయ భరద్వాజ్.. అభినవ్ గోమటం ఈ సినిమాలో ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. షమీర్ సుల్తాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ జెనరేషన్ యూత్ కు కనెక్ట్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి.

ఈ సినిమా ప్రమోషన్స్ లో తరుణ్ భాస్కర్ తో పాటు ఆ అనసూయ కూడా పాల్గొంటోంది. అయితే ప్రతి ఇంటర్వ్యూలోనూ అనసూయకు ఎదురయ్యే కామన్ ప్రశ్నఒకటి ఉంది. అదేంటంటే “గతంలో అర్జున్ రెడ్డి రిలీజ్ సమయంలో విజయ్ దేవరకొండపై విమర్శలు గుప్పించారు కదా.. మరి ఇప్పుడు ఎలా విజయ్ నిర్మించిన సినిమాలో పని చేశారు?” ఈ ప్రశ్న ఎదురైన ప్రతిసారి అనసూయ.. గతంలో జరిగిన విషయాలు ఇద్దరం మర్చిపోయామని.. అవేమీ తనపై కానీ విజయ్ పై కానీ ప్రభావం చూపించలేదని చెప్తోంది. వీలైంతవరకూ ఆ టాపిక్ ను కొనసాగనివ్వకుండా ‘గతం గతః’ అన్నట్టుగా వదిలెయ్యమని ఇంటర్వ్యూయర్లను కోరుతోంది.

‘మీకు మాత్రమే’ సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమా షూటింగ్ సమయంలో ఫుల్ గా ఎంజాయ్ చేశానని ఈ సినిమా ప్రేక్షకులకు తప్పనిసరిగా నచ్చుతుందనే నమ్మకం వ్యక్తం చేసింది. ఏదేమైనా ఒక విషయం స్పష్టం.. ఏ కెరీర్లో అయినా ఎదగాలంటే లౌక్యం అవసరం. అప్పుడేదో జరిగిందని ఆఫర్ ను రిజెక్ట్ చేయకుండా అనసూయ లౌక్యంగానే పని పూర్తి చేసిందనే కామెంట్ వినిపిస్తోంది. పైగా ఇంటర్వ్యూలలో అప్పటి విమర్శల గురించి అడిగితే సమాధానం దాటవేయడం లౌక్యం కాక ఇంకేంటి?
Please Read Disclaimer