క్రికెట్ ఆడిన టాలీవుడ్ నటి.. ముగ్ధుడైన యువీ

0

కొత్త సంవత్సరానికి ఓ టాలీవుడ్ నటి క్రికెట్ ఆడుతూ వెల్‌కమ్ చెప్పగా.. ఆమె షాట్‌ను మెచ్చుకుంటూ భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ కామెంట్ చేయడం సోషల్ మీడియాలో వైరలైంది. క్రికెట్ ఫ్యాన్స్ ఈ వీడియాపై లైకులు, కామెంట్లతో తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. అసలు క్రికెట్ ఆడిన ఆ సినీనటి ఎవరంటే సయామీ ఖేర్.. మెగా ఫ్యామిలీకి చెందిన సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ అరంగేట్ర మూవీ రేయ్‌లో ఆమె నటించింది.

ఇక సయామీ ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన వీడియోలో చక్కని షాట్ ఆడుతూ న్యూ ఇయర్‌కు వెల్‌కమ్ చెప్పింది. ప్రొఫెషనల్ ప్లేయర్ తరహాలో సయామీ కొట్టిన స్ట్రైట్ డ్రైవ్ అద్భుతంగా ఉంది. ఈ వీడియోను చూసిన యువీ తనదైన శైలిలో స్పందించాడు. షాట్ బడ్డీ అంటూ ఒక స్మైల్, లైక్ సింబల్‌తో ఆనందం వ్యక్తం చేశాడు.

మరోవైపు నూతన సంవత్సరం సందర్భంగా అభిమానులకు యువీ శుభాకాంక్షలు తెలిపాడు.‘ అందరికీ కొత్త దశాబ్ధపు శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో అందరికీ ప్రేమ, శాంతి, ఆనందం, మంచి ఆరోగ్యం కలగాలిన కోరుకుంటున్నా. మనం కావాలనుకున్న మార్పుకై పాటుపడదాం. ఇతరుల్లోని మంచిని వెలికితీసి, వారిలో స్ఫూర్తినింపుదాం’ అంటూ యువరాజ్ సింగ్ ట్వీట్ చేశాడు. గతేడాది అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరైన యువీ.. ప్రస్తుతం టీ10 లీగ్‌లో ఆడుతున్నాడు. మరాఠా అరేబియన్స్ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించి టీమ్‌కు టైటిల్ అందించాడు.
Please Read Disclaimer