ట్రెండీ టాక్: బిగ్ బాస్ ఇంట్లో కిలాడీ భామలు

0

బిగ్ బాస్ సీజన్ 4 కి రంగం సిద్ధమవుతోంది. ఈ కొత్త సీజన్ హోస్ట్ ఎవరు? అన్నది ఇంకా తేలలేదు. ఈలోగానే పార్టిసిపెంట్స్ జాబితాలోంచి కొన్ని పేర్లు లీకవుతున్నాయి. ఇప్పటికే ప్రముఖ వార్తా చానెల్ లో పని చేసిన బిత్తిరి సత్తిని బిగ్ బాస్ 4 కి ఖాయం చేశారని వార్తలొచ్చాయి.ఈసారి బిగ్ బాస్ హౌస్ లో రేణు దేశాయ్ కూడా కనిపిస్తారని ఇంతకుముందు ప్రచారమైంది. హోస్ట్ గా లేదా పార్టిసిపెంట్ గా కనిపిస్తారన్న గుసగుసలు అయితే వినిపించాయి. అయితే దానికి అధికారిక సమాచారం ఏదీ లేదు. తాజాగా మరో నలుగురు లేడీస్ పేర్లు బయటకు వచ్చాయి. వీళ్లలో ముంబై హాట్ గాళ్ శ్రద్ధా దాస్.. తెలుగమ్మాయి యామిని భాస్కర్.. టాప్ మోడల్ కం నటి హంసా నందిని.. మరో తెలుగమ్మాయి ప్రియా వడ్లమాని.. మోనా అనే మరో నటి ఉన్నారని తెలుస్తోంది.దాదాపు వంద రోజుల పాటు బిగ్ బాస్ హౌస్ ని అట్టుడికించేందుకు ఇలాంటి వేడెక్కించే కిలాడీ భామలు అవసరం అని స్టార్ మా వాళ్లు భావించారట. అందుకే ట్యాలెంటును జల్లెడ వేసి వెతికి మరీ పట్టుకున్నారు. ఇక బిగ్ బాస్ ఇంట్లో ప్రవేశించడం కోసం ఈ భామలు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారన్న గుసగుసలు కూడా వినిపించాయి.

వీళ్లలో శ్రద్ధా దాస్ ఇంతకుముందు తెలుగు బిగ్ బాస్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి కనిపించింది. ఇప్పుడు నేరుగా ఇంటి సభ్యురాలు అవుతోంది. సీన్ చూస్తుంటే.. తొలి మూడు సీజన్లను మించి ఈసారి గ్లామర్ కంటెంట్ ఎక్కువగానే ఉండేట్టు కనిపిస్తోంది. అయితే మసాలా పెర్ఫామెన్స్ తో రక్తి కట్టించే కిలేడీస్ ఎవరు? అన్నదే ఇంపార్టెంట్.
Please Read Disclaimer