స్నేహితుల బాక్సాఫీస్ వార్ ఎవరికి కలిసొచ్చేను?

0

యంగ్ హీరోలు నితిన్ మరియు వరుణ్ లకు కొన్ని దగ్గర పోలికలు ఉంటాయంటారు. వీరిద్దరు కూడా మంచి స్నేహితులుగా మెలుగుతూ ఉంటారు. వీరిద్దరికి కూడా పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. నితిన్ కు పవన్ అంటే హీరోగా ఇష్టం కాగా వరుణ్ కు బాబాయిగా పవన్ పై అమితమైన అభిమానం. వీరిద్దరు పలు సందర్బాల్లో కలవడం పార్టీలకు హాజరు కావడం జరుగుతూనే ఉంది. మంచి స్నేహితులుగా ఉన్న వీరిద్దరి మద్య వార్ జరుగబోతుంది.

వరుణ్ తేజ్ తన తాజా చిత్రాన్ని జులై 30న విడుదల చేయబోతున్నట్లుగా కొన్ని రోజుల క్రితమే ప్రకటన వచ్చింది. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో రూపొందుతున్న వరుణ్ మూవీ బాక్సింగ్ నేపథ్యం తో సాగుతుంది. బాక్సింగ్ తో పాటు ఎంటర్ టైన్ మెంట్ కూడా పుష్కలంగా ఉంటుందని చిత్ర యూనిట్ సభ్యులు నమ్మకంగా చెబుతున్నారు. ఇదే సమయంలో నితిన్ రంగ్ దే సినిమాను కూడా జులై 30న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా తాజాగా ప్రకటన వచ్చింది.

వీరిద్దరి సినిమాలు ఒకే రోజున రాబోతున్న నేపథ్యం లో ఎవరిది పై చేయి అవుతుందా అంటూ ఇప్పటి నుండే చర్చ మొదలైంది. వరుణ్ తో పోల్చితే నితిన్ కాస్త సీనియర్ అయినా కూడా వరుణ్ కు మెగా బ్రాండ్ కలిసి వస్తుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయినా విడుదలకు ఇంకా చాలా సమయం ఉంది కనుక అప్పటి వరకు సమీకరణాలు ఎటు నుండి ఎటుకు మారుతాయో అంటూ మరికొందరు విశ్లేషిస్తున్నారు. మొత్తానికైతే వీరిద్దరు జులై 30న బాక్సాఫీస్ వద్ద తలపడటం ఖాయం అయ్యింది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-