ఆ హీరోయిన్ రూంలోకి కప్పలు వచ్చేవట

0

రూల్స్ ను బ్రేక్ చేయటం చెప్పినంత ఈజీ కాదు. దానికి చాలా దమ్ము కావాలి. అంతకు మించి.. ఏం జరిగినా ఫేస్ చేసే ధైర్యం కావాలి. రిస్క్ చేసే మైండ్ సెట్ మరీ.. మరీ ముఖ్యం. ఇలాంటి క్వాలిటీస్ తనలో టన్నుల కొద్ది ఉన్నాయన్న విషయాన్ని తొలి సినిమాతోనే చెప్పేసింది పాయల్ రాజ్ పుత్. ఇప్పుడంటే హాట్ భామగా ఇమేజ్ ఉంది కానీ.. ఆర్ఎక్స్ 100 కు ముందు ఆమె ఎవరో ఎవరికి తెలీదు.

ఇదే విషయాన్ని ఆమె కూడా చెబుతుంటారు. తనను ఓవర్ నైట్ స్టార్ అని చెబుతుంటారని.. కానీ.. దానికి ముందు ఆరేళ్ల కష్టం ఉందన్న విషయాన్ని గుర్తు చేస్తుంటారు. తాజాగా ఆర్ డీఎక్స్ లవ్ చిత్రంలో గ్లామర్ ను ధారాళంగా ఒలకబోసి..కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న ఆమె.. తాజాగా ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెప్పుకొచ్చారు.

తాజాగా తాను చేసిన సినిమా గురించి చెబుతూ.. ఆర్ఎక్స్ 100 తర్వాత తాను చాలా స్క్రిప్ట్ లు విన్నప్పటికీ.. ఆర్డీఎక్స్ లవ్ మాత్రం భిన్నంగా ఉండటంతో పాటు.. కాస్త బోల్డ్ గా ఉందన్నారు. ఇలాంటి పాత్రలు మనం కూడా చేయకపోతే ఇంకెవరు చేస్తారనిపించి.. చేశానని చెప్పారు. రోటీన్ పాత్రలకు భిన్నమైన పాత్రలు చేయాలని తాను అనుకుంటున్నట్లు చెప్పారు.

ఈ సినిమా షూటింగ్ విశేషాలు చెబుతూ.. ఇందులో ఫైట్స్ కు డూప్ పెడతానని చెప్పినా.. వద్దని తానే చేశానని చెప్పింది. ఆ ప్రయత్నంలో భాగంగా మోకాలి దగ్గర చిన్న ఫ్యాక్చర్ కూడా అయ్యిందన్న ఆమె.. ఈ సినిమా షూటింగ్ కోసం 45 రోజులు పాపికొండల్లోని ఒక ప్రాంతంలో ఉన్నానని.. తనకో రూమ్ ఇచ్చారన్నారు.

ఆ రూంలో అప్పుడప్పడుు కప్పలు కూడా వచ్చేవని.. అలా అని తాను కంప్లైంట్ చేయటం లేదని ముందుచూపుతో చెప్పేశారు. షూటింగ్ అంతా మంచి జ్ఞాపకంగా చెప్పిన ఆమె.. డబ్బులు కోసం సినిమాలు చేయనని చెప్పింది. ఏమైనా.. అవకాశాలు వచ్చిపడుతున్న వేళ.. సౌకర్యాల కోసం డిమాండ్ చేయకుండా సర్దుకోవటం చూస్తే.. రానున్న రోజుల్లో అమ్మడు మరిన్ని అవకాశాల్ని అందిపుచ్చుకునే లక్షణం ఉందనిపించక మానదు