విదేశీ గాళ్ తో నిండా మునిగిన హీరోగారు!

0

విదేశీ మోడల్ కం ఫ్యాషన్ డిజైనర్ గాబ్రియెల్లా దిమెత్రియస్ ని పెళ్లాడాడు అర్జున్ రాంపాల్. ఈ జంట ఇటీవలే ఓ బిడ్డకు మమ్మీ డాడీ అయిన సంగతి తెలిసిందే. ఇక అర్జున్ రాంపాల్ తన భార్య మెహర్ జెసియాకు 20 ఏళ్ల వైవాహిక జీవితం అనంతరం విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. 2018 మేలో విడిపోతున్నట్టు పరస్పరం నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు. జెస్సియా నుంచి విడిపోయిన అర్జున్ రాంపాల్ తన విదేశీ స్నేహితురాలు గాబ్రియెల్లా దిమెత్రియస్ ని పెళ్లాడాడు. ఇటీవల ఈ దంపతులు ఒక పండంటి బిడ్డకి తల్లిదండ్రులు అయ్యారు. అతనికి అరిక్ అని పేరు పెట్టారు. వారసుడితో ఈ జంట బహిరంగ విహారం అభిమానుల్లో నిరంతరం హాట్ టాపిక్. జంట విహారానికి సంబంధించిన ఫోటోల్ని ఆ ఇద్దరూ పలుమార్లు షేర్ చేశారు.

అర్జున్ రాంపాల్ – గాబ్రియెల్లా డెమెట్రైడ్స్ 2009 లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) పార్టీ తరువాత స్నేహితులయ్యారు. ఆ క్రమంలోనే స్నేహం కాస్తా ప్రేమగా మారిందని చెబుతారు. గాబ్రియెల్లా దక్షిణాఫ్రికాలో పుట్టి పెరిగింది. ప్రపంచంలోని హాటెస్ట్ మోడల్ గా … డిజైనర్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఏకకాలంలో అటు సొంత దేశంలో.. అలాగే భారతదేశంలో తన మోడలింగ్ – నటనా వృత్తిని కొనసాగించింది. వస్త్ర వ్యాపారం లో 50 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న ఫ్యామిలీ తనది. దక్షిణాఫ్రికా మోడల్ కం నటి అయిన గాబ్రియెల్లా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) తో సుపరిచితం. FHM 100 సెక్సీయెస్ట్ ఉమెన్ ఇన్ ది వరల్డ్ పోటీలకు ఎంపికై పాపులారిటీ తెచ్చుకుంది.

గాబ్రియెల్లా దిమిత్రియస్ సినీకెరీర్ పరిశీలిస్తే… మలయాళ చిత్రం రెడ్ వైన్ లో ప్రత్యేక గీతంలో మెరిసింది. `నీలాకాశం కైవిడం` అనే పాటలో నర్తించింది. `తు హాయ్ ప్యార్ హై` సింగిల్ లో ఆదిత్య నారాయణ్ సరసన కనిపించింది. సోనాలి కేబుల్ అనే చిత్రంలోనూ నటించింది.

అర్జున్ మాజీ భార్యకు గ్రేట్ హిస్టరీ ఉంది. మెహర్ జెసియా 1986 ఫెమినా మిస్ ఇండియా విజేత.. తొలితరం భారతీయ సూపర్ మోడల్స్ మధు సాప్రే- ఫిరోజ్ గుజ్రాల్- శ్యామోలీ వర్మ – అన్నా బ్రెడ్ మేయర్ లకు కొలీగ్. అర్జున్ రాంపాల్ – మెహర్ జెస్సియాకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె మహికాకు 17 సంవత్సరాల వయస్సు. అలాగే రెండో కుమార్తె మైరాకు 14 సంవత్సరాలు. సిస్టర్స్ మహికా- మైరా ఇద్దరూ తమ తల్లితోనే ఉంటున్నారు.
Please Read Disclaimer