గద్దలకొండ బ్యూటీ సాఫ్ట్ వేర్ టు సినీ ఫీల్డ్ జర్నీ

0

వరుణ్ తేజ్ కీలక పాత్రలో నటించిన ‘గద్దలకొండ గణేష్’ చిత్రంతో మృణాళిని రవి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. తమిళంలో చాలా బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మను ఏరికోరి మరీ దర్శకుడు హరీష్ శంకర్ గద్దలకొండ సినిమాలో నటింపజేశాడు. హరీష్ నమ్మకంను నిలుపుతూ తనకు ఇచ్చిన పాత్రకు మృణాళిని పూర్తి న్యాయం చేసింది. గద్దలకొండ గణేష్ చిత్రం తర్వాత తెలుగులో మృణాళిని బిజీ అయ్యింది. ఇప్పటికే ఈమె రెండు మూడు సినిమాలకు కమిట్ అయినట్లుగా తెలుస్తోంది. మరో వైపు ఈమె తమిళంలో కూడా చాలా బిజీ హీరోయిన్ గా వరుస చిత్రాలకు కమిట్ అవుతుంది.

ఇంతటి బిజీ హీరోయిన్ గా మారిపోయిన మృణాళిని రవి బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా… ఏమీ లేదు. అవును బ్యాక్ గ్రౌండ్ ఏమీ లేకుండానే కేవలం సోషల్ మీడియా ద్వారానే మృణాళిని గుర్తింపు దక్కించుకుంది. చిన్నప్పటి నుండి డాన్స్ మరియు నటనపై ఆసక్తి కనబర్చుతూ వచ్చిన మృణాళిని సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండేది. ఈమద్య కాలంలో వచ్చిన డబ్ ష్మాష్ మరియు టిక్ టాక్ ల్లో వీడియోలు తెగ చేసేంది. ఈమె చేసే వీడియోల కోసం టిక్ టాక్ ఫాలోవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసేవారు. చేసిన ప్రతి వీడియోకు కూడా ప్రాణం పెట్టి చేసేది. దాంతో ఆమె ప్రతి వీడియో కూడా వైరల్ అయ్యేవి. తమిళనాడుతో పాటు పలు ప్రాంతాల్లో ఈమెకు ఫ్యాన్స్ అయ్యారు.

ఇంజనీరింగ్ లో ఉన్నప్పటి నుండి వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో సందడి చేసిన మృణాళినికి ఇంజనీరింగ్ పూర్తి అయిన వెంటనే ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో జాబ్ వచ్చింది. జాబ్ చేసుకుంటూ కూడా వీడియోలను చేస్తూ తన సరదాను షేర్ చేసుకునేది. మృణాళిని వీడియోలు తమిళ నిర్మాతలు.. ప్రొడక్షన్ మేనేజర్ ల దృష్టికి వచ్చాయి. దాంతో మృణాళిని దశ తిరిగి పోయింది. పలువురు సినీ నిర్మాతలు మృణాళినిని ఆడిషన్స్ కు పిలిచారు. అలా మొదటగా ‘సూపర్ డీలక్స్’ చిత్రంలో ఛాన్స్ దక్కించుకుంది.

మృణాళిని కుటుంబ సభ్యులు విధ్యాధికులు. కుటుంబంలోని ప్రతి ఒక్కరు కూడా ఉన్నత స్థాయి ఉద్యోగాల్లో ఉన్న వారే. అలాంటి వారు మృణాళిని సినిమాల్లోకి వద్దన్నారు. కాని తనకున్న ఇష్టం మరియు పట్టదలతో కుటుంబ సభ్యులందరిని కూడా ఒప్పించింది. సినిమాల్లో సక్సెస్ కాలేకుంటే ఎక్కువ లేట్ చేయకుండా వచ్చి జాబ్ చేస్తానంటూ కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చి ఆపై సినిమాల్లో నటించడం మొదలు పెట్టింది. సూపర్ డీలక్స్ చిత్రం కోసం జాబ్ చేస్తూనే లీవ్ పెట్టి షూటింగ్ కు హాజరు అయ్యేది.

మొదటి సినిమా తర్వాత ఒకే సారి మూడు సినిమాల్లో ఛాన్స్ రావడంతో ఇక జాబ్ చేస్తూ నటన కష్టంగా నిర్ణయించుకుంది. జాబ్ కు రిజైన్ చేసిన మృణాళిని పూర్తి స్థాయి హీరోయిన్ గా మారిపోయి స్టార్ అయ్యింది. పాండిచేరిలో పుట్టి పెరిగిన మృణాళిని చదువు మొత్తం బెంగళూరులో జరిగింది. సినీ ఎంట్రీ మాత్రం తమిళ ఇండస్ట్రీలో.. ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Please Read Disclaimer