డిజిటల్ లో గద్దలకొండ Vs చాణక్య

0

2019 జనవరి తొలి వారం.. సంక్రాంతి మొదలు వరుసగా వారం వారం సినిమాలు థియేటర్లలో రిలీజవుతూనే ఉన్నాయి. ఇలా థియేటర్లలోకి వచ్చినవి నెలరోజుల్లోనే అమెజాన్.. నెట్ ఫ్లిక్స్ .. హాట్ స్టార్ లాంటి డిజిటల్ మాధ్యమాల్లో అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. సంక్రాంతి సినిమాల్ని 40రోజుల్లోపే ఆన్ లైన్ లో చూసేశారు జనం. అడివి శేష్ హిట్ సినిమా ఎవరు చిత్రం ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది.

ఈలోగానే మరిన్ని సినిమాలు అమెజాన్ సహా పలు డిజిటల్ మాధ్యమాల్లో అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. నవంబర్ 4న వరుణ్ తేజ్ నటించిన గద్దల కొండ గణేష్ హాట్ స్టార్ రాబోతోంది. అలాగే అదే రోజు గోపిచంద్ చాణక్య చిత్రం అమెజాన్ ప్రైమ్ లో రిలీజవుతోంది.

గద్దల కొండ గణేష్ బాక్సాఫీస్ వద్ద అబౌ యావరేజ్ గా నిలిచింది. అంటే ఈ సినిమాని కూడా జనం పూర్తిగా థియేటర్లలోకి వచ్చి చూడలేదు. బ్యాలెన్స్ జనం ఇప్పుడు డిజిటల్ లో చూస్తారన్నమాట. ఇకపోతే చాణక్య చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితం అందుకోలేదు. మెజారిటీ జనం డిజిటల్లోనే చూసేందుకు ప్రయత్నిస్తారు. మునుముందు క్రిస్మస్ సహా రకరకాల పండగలకి వచ్చే సినిమాలు డిజిటల్ లో అందుబాటులోకి రానున్నాయి.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-