రెండోరోజు కూడా దంచేసిన గద్దలకొండ గణేష్.. రికార్డ్ కలెక్షన్స్

0

క్లాస్ హీరోగా పేరుతెచ్చుకున్న వరుణ్‌ తేజ్‌ని వైలెంట్ విలన్‌గా పరిచయం చేస్తూ ఎనర్జిటిక్ డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కించిన సినిమా గద్దలకొండ గణేష్ (గతంలో వాల్మీకి). ఈ సినిమాపై ముందు నుండే అందరికి మంచి ఒపీనియన్ ఉంది. హరీష్ శంకర్ కనీసం రెమ్యునరేషన్ కూడా తీసుకోకుండా కసిగా హిట్ కొట్టాలని తీసిన సినిమా. తమిళ్‌లో సూపర్ హిట్ అయిన జిగర్తాండ సినిమాని తన స్టైల్ మార్పులతో గద్దలకొండ గణేష్ గా తెరకెక్కించాడు హరీష్ శంకర్. రీసెంట్‌గా మాస్ ఎంటెర్టైనెర్‌గా సూపర్ హిట్ అయిన ఇస్మార్ట్ శంకర్ ఇన్స్పిరేషన్‌తో ఉక్కిరిబిక్కిరి చేసేలా మాస్ ఎలిమెంట్స్ దట్టించాడు. అతని మాటల్లో పదును తగ్గింది అనిపించినా కూడా కొన్ని మాత్రం బుల్లెట్స్‌లా బాగానే పేలాయి.

వరుణ్ తేజ్ బ్యాడ్‌బాయ్ క్యారెక్టరైజేషన్ అందరికి కనెక్ట్ అవ్వడంతో గద్దలకొండ గణేష్ బాక్స్ ఆఫీస్ దగ్గర గర్జిస్తున్నాడు. మొదటి రోజు ఈ ఏడాది బిగ్ హిట్స్‌లో ఒకటయిన F2 కలెక్షన్స్‌ని కూడా దాటేసిన గద్దలకొండ గణేష్ సెకండ్‌డే కూడా బాగానే పట్టుకొచ్చాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటిరోజు ఏకంగా 5 కోట్ల 50 లక్షలు వసూళ్లు సాధించి అందరిని అబ్బురపరిచిన గద్దలకొండ గణేష్ రెండో రోజు కూడా 3.45 కోట్లు రాబట్టాడు. దీంతో రెండు రోజులకు గాను 9 కోట్ల మార్క్ టచ్ చేసింది. ఈ రోజు కూడా ఆశించిన కలెక్షన్స్ వస్తే మాత్రం ఈ సినిమా చాలా చోట్ల బ్రేక్ ఈవెన్‌కి చేరువ అవుతుంది. ఓవర్‌సీస్‌లో మాత్రం ఈ సినిమాకి రెస్పాన్స్ బావున్నా కలెక్షన్స్ మాత్రం ఆశించినంతగా లేవు.

మొదటిరోజుతో పోలిస్తే కాస్త తగ్గినా కూడా ఓవరాల్‌గా హిట్ ట్రాక్‌లో వెళుతున్నాడు. ఇప్పుడు థియేటర్స్‌లో అందరికి ఉన్న ఏకైక ఆప్షన్ ఈ మాస్ ఎంటర్టైనరే. ఈ సినిమాతో పాటు రీలీజ్ అయిన సూర్య బందోబస్త్ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ కంటెంట్‌కి తోడు ప్రమోషన్స్ కూడా పెద్దగా లేకపోవడంతో బాగా నెమ్మదించింది. ఈ సినిమాలో సినిమా గురించి హరీష్ శంకర్ ఎమోషనల్‌గా చూపించిన తీరు, దేవత సినిమాలో ‘ఎల్లువొచ్చి గోదారమ్మ’ రీమిక్స్ సాంగ్ లాంటివి సినిమాకి బాగా కలిసొచ్చాయి. అవ్వడానికి మాస్ మూవీ అయినప్పటికీ క్లాస్ ఆడియన్స్ నుండి కూడా స్పందన బావుండడంతో ఆదివారం మరింత పుంజుకుని మూడో రోజు కూడా భారీ కలెక్షన్స్ నమోదు చేసేలా కనిపిస్తున్నాడు గద్దలకొండ గణేష్.

ఏరియాల వారీగా రెండు రోజుల కలెక్షన్స్

నైజాం – 3.04 కోట్లు

ఉత్తరాంధ్ర -1.16 కోట్లు

సీడెడ్ -1.40కోట్లు

నెల్లూరు- 0.38 కోట్లు

గుంటూరు- 0.94 కోట్లు

ఈస్ట్- 0.70 కోట్లు

వెస్ట్ -0.75 కోట్లు

కృష్ణా -0.69 కోట్లు
Please Read Disclaimer