గజకేశరి టీజర్: అదరగొట్టిన రాకింగ్ స్టార్

0

`కేజీఎఫ్` చిత్రంతో సంచలనాలు సృష్టించారు కన్నడ రాకింగ్ స్టార్ యష్. ప్రస్తుతం కేజీఎఫ్ 2 రిలీజ్ కి సిద్ధమవుతోంది. పాన్ ఇండియా కేటగిరీలో ఈ మూవీ రికార్డులు బ్రేక్ చేయడం ఖాయమని అంచనా వేస్తున్నారు. ఈ సీక్వెల్ సినిమాలో కేజీఎఫ్ ని మించిన యాక్షన్ ఎగ్జయిట్ చేస్తుందని ప్రశాంత్ నీల్ ఇంతకుముందు ప్రకటించడంతో అభిమానుల్లో ఎంతో ఉత్కంఠ నెలకొంది.

ఇక కేజీఎఫ్ క్రేజుతో రాకింగ్ స్టార్ యష్ నటించిన `గజకేసరి` బరిలో దిగుతోంది. తాజాగా ఈ మూవీ తెలుగు టీజర్ రిలీజైంది. కేజీఎఫ్ లో మాస్ యాక్షన్ హీరోగా కనిపించిన యష్ ఇందులోనూ భారీ యాక్షన్ స్టార్ గా కనిపిస్తున్నారు. పైగా గజరాజుతో కలిసి యష్ విన్యాసాలు రక్తి కట్టిస్తున్నాయి. శక్తి పీఠాధిపతి పాత్రతో క్యారెక్టర్ ని ఫిక్షనలైజ్ చేయడం ఉత్కంఠను పెంచుతోంది. అసలు మోడ్రన్ డేస్ కుర్రాడికి పీఠాధిపతి లింకేమిటన్నది తెరపైనే చూడాల్సి ఉంటుంది. ఇక టీజర్ తోనే ఈ మూవీ లో యాక్షన్ మరో లెవల్లో ఉంటుందని అర్థమైంది. ముఖ్యంగా గజరాజు తొండం పై నుంచి యష్ జంప్ చేసే సీన్ చూస్తుంటే ఆంగ్ లీ నటించిన ఆంగ్ బ్యాక్ 3 విన్యాసాలు గుర్తుకొస్తున్నాయి.

యష్- అమూల్య జంటగా కన్నడలో ఇదివరకూ రిలీజై విజయం సాధించిన `గజకేశరి` అదే టైటిల్ తో తెలుగులోనూ వస్తోంది. ఈ చిత్రానికి కృష్ణ దర్శకత్వం వహించారు. శ్రీ వేదక్షర సినిమాస్- కలర్స్ & క్లాప్స్ ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా రిలీజ్ చేస్తున్నాయి. హరికృష్ణ సంగీతం అందించగా… దీపు ఎస్ కుమార్ ఎడిటర్. రవివర్మ- గణేష్ స్టంట్స్ ని కొరియోగ్రాఫ్ చేశారు.