ఈ డెబ్యూ హీరో వేల కోట్ల అధిపతి

0

హీరో అవ్వడం అంటే పెట్టి పుట్టాలి. ఎన్నో జన్మల పుణ్యఫలం అని చెబుతుంటారు పరిశ్రమ ప్రముఖులు. టాలీవుడ్ లో హీరో అయ్యి నిలదొక్కుకోవడం అంటే చాలా స్టాండార్డ్స్ ఉండాలి. నెప్టోయిజం (నటవారసత్వం) రాజ్యమేలే చోట కొత్త హీరో వచ్చి నిలదొక్కుకోవడం అంటే అదో సవాల్ లాంటిది. ప్రతిభతో పాటు ఎన్నో మార్కెట్ క్యాలిక్యులేషన్స్ .. లక్ ఫ్యాక్టర్ ఇవన్నీ ఎవరు హీరో కావాలి. ఎవరు కాకూడదు అన్నది డిసైడ్ చేస్తుంటాయి. సినీ కుటుంబం అండదండలు ఉన్నా అది అవకాశాలు తేవడం వరకే. ఆ తర్వాత నిరూపించుకుని ఎవరికి వారు ఎదగాలి. అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ ఎక్కడ చూసినా ఈ సన్నివేశం ఉంది.

అయితే ఇలాంటి చోట ఓ డెబ్యూ హీరో రంగ ప్రవేశం హాట్ టాపిక్ గా మారింది. ఎందరో కార్పొరెట్ గురూలు.. కార్పొరెట్ కంపెనీల ఓనర్ల పుత్ర రత్నాలు ఇక్కడ హీరోలుగా ట్రై చేసి ఫెయిలైన సందర్భాలున్నాయి. అయినా ఇంకా వస్తూనే ఉన్నారు. తాజాగా సినీ నేపథ్యం కార్పొరెట్ కంపెనీల నేపథ్యం ఉన్న అశోక్ గల్లా ఎంట్రీ హాట్ టాపిక్ గా మారింది. మహేష్ కి అశోక్ మేనల్లుడు. ఆయన అక్కా బావలైన గల్లా పద్మ- జయదేవ్ దంపతుల వారసుడు అశోక్ గల్లా. అతడి డెబ్యూ సినిమాని తల్లిదండ్రులే నిర్మిస్తున్నారు. తాజాగా డెబ్యూ హీరో ఫోటోతో పాటు రిలీజ్ చేసిన ఆహ్వాన పత్రికలో ఓ ప్రముఖ కార్పొరెట్ బ్రాండ్ లోగో డిజైన్ గా కనిపించింది.

డెబ్యూ హీరో అశోక్ ఆహ్వాన పత్రికలో అమర్ రాజా గ్రూప్ లోగో కనిపించింది. అమర్ రాజా గ్రూప్ అంటే వరల్డ్ ఫేమస్. ఈ కంపెనీలో దాదాపు 12000 మంది ఉద్యోగులు ఉన్నారు. అంతర్జాతీయ స్థాయిలో వ్యాపార వాణిజ్యాలు నిర్వహిస్తోంది. అమర్ రాజా బ్యాటరీస్ ప్రపంచవ్యాప్తంగా పాపులర్ బ్రాండ్. ఆసియాలోనే బిలియన్ డాలర్ బిజినెస్ చేసే బెస్ట్ కంపెనీల జాబితాలో నిలిచింది. ఫోర్బ్స్ జాబితాలోనూ అమర్ రాజా గ్రూప్ టాప్ పొజిషన్ లో నిలిచింది. ఒక బిలియన్ అమెరికా డాలర్ల విలువ చేసే ఆస్తులు అమర్ రాజా గ్రూప్ సొంతం. దాదాపు ఈ కంపెనీల నికర ఆస్తుల విలువ 7137 కోట్లు అని ఓ అంచనా. గల్లా వారి వారసుడు డెబ్యూ హీరో అశోక్ స్థాయిని దీనిని బట్టి అంచనా వేయొచ్చు. ఓ అంచనా ప్రకారం బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ ని మించిన స్థితిమంతుడు అనడంలో సందేహం లేదు. రణబీర్ కపూర్ మొత్తం ఆస్తుల విలువ 500 కోట్లుగా ఉంటుందని ఇంతకుముందు ఓ అంచనా వెలువడింది.
Please Read Disclaimer