ప్రీ లుక్ – ఐదు చేతుల లీడర్

0

న్యాచురల్ స్టార్ గ్యాంగ్ లీడర్ హంగామా మొదలైంది. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీని మైత్రి సంస్థ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా దీని ప్రీ లుక్ ని రిలీజ్ చేశారు.స్టోరీ లైన్ గురించి ఇప్పటికే కొన్ని వార్తలు ప్రచారంలో ఉన్న నేపథ్యంలో వాటిని నిజం చేస్తూ నాని గ్యాంగ్ లో ఉన్నది ఐదుగురు లేడీసే అన్న క్లారిటీ ఇచ్చారు. ప్రీ లుక్ లో మొహాలు చూపించలేదు కానీ ఐదుగురు ఒకరు చేతుల మీదుగా మరొకరు వేసుకోగా కింద వాళ్లందరికీ అభయం ఇస్తూ నాని తన చేతిని పెట్టడం ఆకట్టుకునేలా ఉంది.

ఇంత కన్నా క్లూ ఇందులో ఇవ్వలేదు కాబట్టి ఫ్యాన్స్ ప్రస్తుతానికి ఈ ప్రీ లుక్ తో సర్దుకోవాల్సిందే. మిగిలిన వివరాల్లోకి వెళ్తే గ్యాంగ్ లీడర్ కంప్లీట్ ఫస్ట్ లుక్ ని జులై 15 మొదటి పాటను జులై 18 టీజర్ ని జులై 24న విడుదల చేయబోతున్నారు. అంటే నాని ఫ్యాన్స్ కి ఒకే వారంలో మూడు కానుకలన్న మాట. చూస్తుంటే గ్యాంగ్ లీడర్ మంచి స్పీడ్ తో వచ్చేలా ఉన్నాడు. చిరంజీవి అల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ ని టైటిల్ గా పెట్టుకోవడంతో మెగా ఫ్యాన్స్ చూపు కూడా నాని గ్యాంగ్ లీడర్ మీద గట్టిగా ఉంది.

అంచనాలు తప్పకుండా విక్రమ్ నానిలు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చిరు గ్యాంగ్ లీడర్ కు భిన్నంగా ఇందులో నాని లేడీస్ గ్యాంగ్ కి లీడర్ గా ఉండటమే స్పెషల్ సర్ప్రైజ్ గా చెప్పొచ్చు. జెర్సీతో వసూళ్ల కంటే ఎక్కువగా మెప్పులు పొందిన నాని గ్యాంగ్ లీడర్ ని హ్యూజ్ కమర్షియల్ హిట్ కావాలనే దిశగా వర్క్ ఔట్ చేస్తున్నాడు. మాస్ గా కాకుండా క్లాస్ గా విమెన్ గ్యాంగ్ లీడర్ గా వస్తున్న నాని మొత్తానికి అంచనాలు పెంచే పనిని గట్టిగానే చేస్తున్నాడు
Please Read Disclaimer