ఆగస్టులోనే గ్యాంగ్ లీడర్ ప్రమోషన్స్

0

మంచి రిలీజ్ తేదీ.. సరైన పబ్లిసిటీ సినిమాలకు చాలా ఇంపార్టెంట్. థియేటర్లలో ఫలానా సినిమా ఆడుతోందని జనాలకు తెలియకపోతే ఎంత గొప్ప సినిమా తీసినా వృధానే. అందుకే ఆ రెండు విషయాల్లో హీరోలు.. దర్శకనిర్మాతలు ఎంతో జాగ్రత్తగా ఉంటున్నారు. పోటీ లేకుండా రిలీజ్ చేసేందుకు.. ప్రచారంతో దూసుకెళ్లేందుకు ముందస్తు ప్రణాళికలు వేస్తున్నారు. అయితే పెద్ద సినిమాలతో క్లాషెస్ రాకుండా చూసుకోవడం అంతే కీలకంగా మారుతోంది.

ఇటీవలే `సాహో` రిలీజ్ వాయిదా అనగానే ఓ రెండు సినిమాలకు కలిసొచ్చింది. అదే వాయిదా వేరొక సినిమాని ఇబ్బందుల్లోకి నెట్టేసింది. శర్వా నటించిన రణరంగం.. అడివి శేష్ నటించిన `ఎవరు` చిత్రాలకు `సాహో` వాయిదా ప్లస్ అయ్యింది. అటు బాలీవుడ్ లోనూ మరో రెండు భారీ చిత్రాలకు పెద్ద రిలీఫ్ దక్కింది. అయితే `సాహో` వాయిదా వల్ల ప్రధానంగా దెబ్బ పడింది నాని `గ్యాంగ్ లీడర్`కే. ఆ సినిమాని ఆగస్టు 30న రిలీజ్ చేస్తున్నామని నాని స్వయంగా సామాజిక మాధ్యమాల్లో ప్రకటించారు. అయితే సాహో చిత్రాన్ని ఆగస్టు 15 నుంచి 30వ తేదీకి వాయిదా వేయడంతో ఇప్పుడు నాని సినిమా వాయిదా తప్పడం లేదట.

సెప్టెంబర్ కి `గ్యాంగ్ లీడర్` చిత్రాన్ని వాయిదా వేస్తున్నారట. అందుకే ఇటీవల నాని టీమ్ ప్రచారం విషయంలో చడీచప్పుడు చేయడం లేదు. ఫలానా తేదీ అని ఫిక్స్ చేయగానే ప్రమోషన్ ప్రారంభించనున్నారు. ఇటీవలే గ్యాంగ్ లీడర్ నుంచి `రా రా` థీమ్ సాంగ్ రిలీజై ఆకట్టుకుంది. అనిరుధ్ మార్క్ మ్యూజిక్ అలరించింది. విక్రమ్.కె.కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home