టీజర్: నాని ‘గ్యాంగ్ లీడర్’

0

న్యాచురల్ స్టార్ నాని జెర్సీ లాంటి ఎమోషనల్ రైడ్ తర్వాత సరికొత్త రివెంజ్ డ్రామాతో వస్తున్నాడు. అదే గ్యాంగ్ లీడర్. మెగా స్టార్ ఫ్యాన్స్ ఈ టైటిల్ మీద తొలుత అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ సినిమా చూసాక చెప్పండి అని నాని రిక్వెస్ట్ చేశాక అవన్నీ ఆగిపోయాయి. ఇక దీని టీజర్ ని ఇందాకా రిలీజ్ చేశారు. కథ విషయానికి వస్తే పెన్సిల్(నాని)ప్రఖ్యాత రివెంజ్ స్క్రిప్ట్ రైటర్. ప్రతీకారం మీద కథలు రాయడంలో అందె వేసిన చేయి.

అతని దగ్గరికి ఓ ఐదుగురు లేడీ గ్యాంగ్ వస్తుంది. ఎనిమిదేళ్ల పాప నుంచి డెబ్భై ఏళ్ళ భామ దాకా అందరు ఉంటారు. ఒక వ్యక్తి (కార్తికేయ) మీద రివెంజ్ తీర్చుకోవడం కోసం పెన్సిల్ సహాయం అడుగుతారు. మొదట పెన్సిల్ ఈ వ్యవహారాన్ని సరదాగా తీసుకున్నా తర్వాత సీరియస్ టర్న్ తీసుకుంటుంది. తాను ఒప్పుకున్న బాధ్యత చిన్నది కాదని అర్థమైపోతుంది. మరి పెన్సిల్ వాళ్లకు ఎలా సహాయపడ్డాడు ప్రతీకారం ఎలా ముగిసింది అనేదే గ్యాంగ్ లీడర్

టీజర్ లో కాన్సెప్ట్ ని క్లియర్ గా చూపించేశారు. కామెడీ టైమింగ్ తో పాటు పాత్రల మధ్య సహజంగా అనిపిస్తున్న సంభాషణలు బాగా పేలాయి. ఓ బేబీలో మురిపించిన సీనియర్ నటి లక్ష్మి గారితో పాటు శరణ్య కూడా లీడ్ రోల్స్ చేయడం గమనార్హం. ఆడాళ్ళ మధ్య కామెడీకి నలిగిపోయే పాత్రలో నాని చాలా డిఫరెంట్ గా ఉన్నాడు. హీరొయిన్ ప్రియాంకా ఆరుళ్ మోహన్ క్యుట్ లుక్స్ తో ఆకట్టుకుంది.

బ్యాక్ షాట్ లో తప్ప విలన్ గా నటించిన కార్తికేయను రివీల్ చేయలేదు. అనిరుద్ రవిచందర్ బీజీఎమ్ సింపుల్ గా ఉంది. మిరోస్లా కుబా బ్రోజెక్ ఛాయాగ్రహణం రిచ్ ప్రెజెంటేషన్ ఇచ్చింది. ఇక విక్రమ్ కె కుమార్ దర్శకత్వం తనదైన టిపికల్ స్క్రీన్ ప్లే తో విభిన్నంగా సాగినట్టు అనిపించింది. గతంలో ఆగస్ట్ 30 అని రిలీజ్ డేట్ చెప్పారు కానీ ఇప్పుడు మాత్రం కమింగ్ సూన్ అని టీజర్ చూపించారు కాబట్టి మార్పు జరిగే అవకాశం ఉంది
Please Read Disclaimer