సినిమాలు ఓకే మరి సౌండేది?

0

టాలీవుడ్ లో భారీ సినిమాల సందడి సాహోతో గత వారమే మొదలైపోయింది. దాని ఫలితం ఆశించిన విధంగా వచ్చి ఉంటే పరిస్థితి ఇంకోలా ఉండేది కానీ నెగటివ్ టాక్ తో హడావిడి మొదటి నాలుగు రోజులకే పరిమితమైంది. సాహో మీద నమ్మకంతో ఇంకే ఇతర నిర్మాతలు తమ సినిమాలను వారం గ్యాప్ తో వదిలే సాహసం చేయలేకపోయారు. దీనికి 13 నుంచి బ్రేక్ పడనుంది.

నాని గ్యాంగ్ లీడర్ ఈ శుక్రవారమే థియేటర్లలో అడుగు పెట్టబోతున్నాడు. లేడీ గ్యాంగ్ తో రివెంజ్ డ్రామాను నడిపించే పాయింట్ మీద దర్శకుడు విక్రమ్ కుమార్ దీన్ని తీర్చిదిద్దారు. చెప్పుకోవడానికి మూడు రోజుల టైమే ఉంది కానీ సోషల్ మీడియాలో కానీ జెనరల్ పబ్లిక్ లో కానీ దీని మీద ఉండాల్సినంత హైప్ కనిపించడం లేదు. ఓ ప్రీ రీలీజ్ – ప్రెస్ మీట్ తో సరిపెట్టేసి నాని ప్రమోషన్ కోసం అవుట్ డోర్ వెళ్ళాడు

ఇక వరుణ్ తేజ్ వాల్మీకి ఆపై వారం 20న రానుంది. ట్రైలర్ తో మంచి మాస్ మసాలా సినిమా అనే అభిప్రాయం అయితే కలిగించారు కానీ దానికి తగ్గ బజ్ ని పబ్లిక్ లో తీసుకురావడంలో టీమ్ అంత యాక్టివ్ గా కనిపిస్తున్న దాఖలాలు లేవు. వినయ విధేయ రామ – చిత్రలహరి తర్వాత వస్తున్న మెగా హీరోల సినిమా ఇదే. కానీ ఆ అవకాశాన్ని పూర్తిగా వాడుకుంటున్న సూచనలు ప్రస్తుతానికి లేవు.

ఇక సైరా కూడా దీనికి మినహాయింపుగా లేదు. అక్టోబర్ 2కి కేవలం ఇరవై రెండు రోజులు గడువు మాత్రమే ఉంది. ఇప్పటిదాకా ప్రీ రిలీజ్ తాలూకు వార్తలు కూడా లేవు. ఇలా వరసగా క్రేజీ సినిమాలు వస్తున్నా ప్రమోషన్ విషయంలో మేకర్స్ అవలంబిస్తున్న పద్ధతి చూస్తుంటే ఓపెనింగ్స్ కి గండి పెట్టుకునేలా ఉన్నారు.
Please Read Disclaimer