వయసెక్కువా.. ఐతే ఏంటి.. మనసులు కలిశాయి

0

ప్రేమకు అనాథిగా వస్తున్న హద్దులు వరసగా చెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఎన్నో కులాంతర వివాహాలు మతాంతర వివాహాలు జరిగాయి. అయితే వయసుపై కొంత మెర పట్టింపులు ఉన్నాయి. కులం మతం వేరైనా తల్లిదండ్రులు ఒప్పుకుంటారేమో గానీ.. అమ్మాయి వయస్సులో పెద్దదైతే మాత్రం పెద్దవాళ్లు ససేమిరా అంటుంటారు. అమ్మాయి .. అబ్బాయికంటే హైట్ తక్కువ ఉండాలని.. వయసు కనీసం రెండేయినా తక్కువగా ఉండాని పెద్దవాళ్లు చెబుతుంటారు. కాగా మహిళా సంఘాల నాయకురాళ్లు ఈ పాత పద్ధతులను కొట్టిపారేస్తారు. ఎందుకంటే పురుషాధిక్య సమాజంలో అన్నింట్లో మహిళల కంటే పురుషులే అధికులుగా ఉండాలనే ఉద్దేశంతో ఇలా అణచివేస్తున్నారని స్త్రీవాదుల అభిప్రాయం.

అయితే ఇప్పుడిప్పుడే ట్రెండ్ మారుతోంది. పురుషుల ఆలోచనల్లో మార్పు కనిపిస్తున్నది. తన కంటే పెద్దదైన అమ్మాయిని కూడా ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. బాలీవుడ్ కంపోజర్ ఇస్మాయిల్ దర్బార్ కుమారుడు కొరియోగ్రాఫర్ జైద్ దర్బార్ బాలీవుడ్ నటి గౌహర్ఖాన్ డేటింగ్లో ఉన్న విషయం తెలిసిందే. నవంబర్లో వాళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటారని టాక్. గౌహర్ ఇప్పడు బిగ్బాస్ హౌజ్లో ఉన్నారు. దీంతో ఈ విషయంపై తండ్రి జైద్ తండ్రి ఇస్మాయిల్ దర్బార్ స్పందించారు. ఇంతకీ జైద్ ఏమంటారంటే.. ‘జైద్ గౌహర్ ప్రేమలో ఉన్నారు. గౌహర్ అంటే నాకు ఎంతో అభిమానం. మా కుటుంబంపై ఆమెకు ఎంతో గౌరవం ఉంది. వారిద్దరి ప్రేమ బంధంపై నాకు మా కుటుంబానికి అభ్యంత రాలు లేవు. నా కుమారుడి కంటే వయసులో గౌహర్ ఐదేళ్లు పెద్ద. అయినా ఓ తండ్రిగా నేను వారి వివాహానికి మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను. అందులో తప్పేముంది’ అంటూ చెప్పుకొచ్చారు ఇస్మాయిల్.