శ్రీమతి కాజల్ సండే స్పెషల్ ఏంటో చెప్పరూ?

0

అందాల చందమామ.. స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఈ శుక్రవారం తన చిరకాల మిత్రుడు.. బాయ్ ఫ్రెండ్ గౌతమ్ కిచ్లూని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ముంబైలోని తాజ్ హోటల్ లో అత్యంత సన్నిహితుల మధ్య కాజల్ వివాహం జరిగింది. పెళ్లికూతురుగా ముస్తాబై కాజల్ మెస్మరైజ్ చేసింది. డిజైనర్ అనామికా ఖన్నా డిజైన్ చేసిన లెహెంగాలో కాజల్ మెరిసిపోయింది.

రెడ్ కలర్ లెహెంగాలో పెళ్లి కూతురుగా ముస్తాబై హొయలు పోయింది.ఈ డ్రెస్ లో వున్న ఫొటోలని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. రెడ్ అండ్ పింక్ కలర్ లో లెహెంగాని అనామికా ఖన్నా టీమ్ సిద్ధం చేశారు. దీనిపై ట్రెడిషనల్ ఆభరణాలని ధరించిన కాజల్ ఫొటోలకు పోజులిచ్చింది. ఈ ఫొటోలు చూసిన ఫ్యాన్స్ కాజల్ అందాన్ని చూసి మురిసిపోతున్నారు.

కాజల్ లెహెంగాని 20 మంది నెల రోజుల పాటు సిద్ధం చేయడం విశేషం. వారి పనితీరుకు ముగ్ధురాలైన కాజల్ ఈ సం్దర్భంగా ప్రశంసల్లో ముంచెత్తింది. ఎవ్రీడీటెయిలింగ్ ని మిస్ చేయకుండా చాలా హార్డ్ వర్క్ చేశారని చాలా ప్రేమతో దీన్ని రూపొందించారని అభినందించింది. ఇదిలా వుంటే కొత్త వరుడు గౌతమ్ కిచ్లూ ఆదివారం కాజల్ మోనోక్రామ్ పిక్చర్ షేర్ చేస్తూ శ్రీమతి కిచ్లు లా ఆమెని మేల్కొల్పానని` కామెంట్ పెట్టడం ఆకట్టుకుంటోంది. ఈ ఫొటోలో కాజల్ నాన్ గ్లామర్ గా .. జుట్టు చెరిగిపోయి సాధారణ టీషర్ట్ లో కనిపించడం నెటిజన్స్ ని ఆకట్టుకుంటోంది.