హీరోయిన్లు ఇష్ట పూర్వకంగానే కమిట్ అవుతున్నారన్న నటి

0

సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ మీద సాగుతున్న రగడ అంతా ఇంతా కాదు. ఇండస్ట్రీ లో ఇవన్నీ కామన్ అని కొందరు అంటుంటే.. తమకు అలాంటి బ్యాడ్ ఎక్స్ పీరియన్స్ ఇప్పటివరకూ ఎదురు కాలేదని.. టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వీరి మాటలు ఇలా ఉంటే.. కొందరు నటీమణులు మాత్రం కాస్తంత పచ్చిగానే ఓపెన్ అవుతున్నారు.

టాలీవుడ్ లో మాత్రమే కాదు.. ఇండస్ట్రీ ఏదైనా కానీ ఛాన్సులు రావాలంటే దర్శక నిర్మాతలతో పాటు హీరోలతో కూడా కమిట్ కావాల్సిందేనని చెప్పి సంచలనంగా మారారు నటి గాయత్రిరావు. ముఖ్యుల పడక కోరికల్ని తీరిస్తే కానీ ఛాన్సులు రావన్న ఆమె మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి. క్యాస్టింగ్ కౌచ్ అన్న మాట పేరుకే కానీ.. ఇష్టం లేకపోతే ఎవరూ బలవంతం చేయరని చెప్పుకొచ్చింది.

ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు ఇష్ట పూర్వకంగానే కమిట్ అవుతున్నారని.. వాళ్లకు అవసరం.. ఎదుటోడి ఆనందంతోనే ఇవన్నీ జరుగుతున్నాయంటూ ఓపెన్ అయ్యింది. ఆ మధ్యన బిగ్ బాస్ సీజన్ త్రీ ఆడిషన్స్ సందర్భంగా పలు ఆరోపణలు చేయటంతో పాటు.. పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన గాయత్రి రావు.. తాజాగా మరోసారి ఓపెన్ అయ్యారు. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందన్న విషయం తానెప్పటి నుంచో చెబుతున్నారని.. అందులో కొందరు హీరోయిన్లు ఇష్టంతో చేస్తున్నప్పుడు కాదనటానికి మనమెవ్వరమంటూ ఆమె చేసిన తాజా వ్యాఖ్యలు మరోసారి సంచలనంగా మారాయి.
Please Read Disclaimer