గీతా ఆర్ట్స్ లో ఆ చిన్న సినిమా.. ఎందుకు?

0

టాలీవుడ్ లో ఉన్న ప్రముఖ నిర్మాణ సంస్థలలో గీతా ఆర్ట్స్ ఒకటి. గీతాలో సినిమా అంటే దాదాపుగా హిట్ అని ఫిక్స్ అయిపోవచ్చు. ఎప్పుడో తప్ప సినిమాలు మిస్ ఫైర్ అవ్వవు. ఇక గీతా సంస్థ పంపిణీ చేసే చిత్రాల సక్సెస్ రేట్ కూడా ఎక్కువగా ఉంటుంది. గీతా వారు ఎంతో ఆచితూచి సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేస్తారని అందరికీ తెలిసిందే. అందుకే గీతా వారు ఏదైనా ప్రాజెక్ట్ టేకప్ చేస్తే అందరి దృష్టి ఆ సినిమాపై పడుతుంది.

తాజాగా గీతా వారు ‘నిన్ను తలచి’ అనే కొత్త వారితో రూపొందించిన ఒక స్మాల్ బడ్జెట్ ఫిలిం ను డిస్ట్రిబ్యూట్ చేసేందుకు సిద్ధమవుతున్నారట. దీంతో ఒక్కసారిగా ఈ సినిమాలో హీరో ఎవరు.. దర్శక నిర్మాతలు ఎవరు? అనే టాక్ మొదలైంది. అయితే ఈ సినిమాను టేకప్ చేసే విషయంలో అల్లు అర్జున్ ప్రోద్బలం ఉందని.. అందుకే గీతా ఆర్ట్స్ వారు ఈ సినిమాను పంపిణీ చేయబోతున్నారని మరో వెర్షన్ కూడా వినిపిస్తోంది. మరి బన్నీకి ‘నిన్నుతలచి’ టీమ్ కు కనెక్షన్ ఏంటి అనే వివరాలు మాత్రం ఇంకా బయటకు రాలేదు.

ఒకవేళ ఎంత బన్నీ సిఫార్సు అయినా సరైన కంటెంట్ లేకపోతే అరవింద్ గారు ఒప్పుకోరు అనేది అందరూ అనుకునే విషయం. మరి ఈ ‘నిన్ను తలచి’ సంగతేంటో త్వరలోనే అందరికీ తెలిసే అవకాశం ఉంది. ఈ చిత్రానికి దర్శకుడు అనిల్ తోట.
Please Read Disclaimer