గీతగా సమంత.. గోవిందంగా చైతన్య

0

గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘గీత గోవిందం’ చిత్రం ఎంతటి సెన్షేషనల్ సక్సెస్ ను దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్నలు స్టార్స్ అయ్యారు. ఆ సినిమా విడుదల సంవత్సరంనర అవుతుంది. ఎట్టకేలకు ఆ సినిమా దర్శకుడు పరుశురామ్ తన కొత్త సినిమాను ప్రకటించాడు. నాగచైతన్య హీరోగా 14 రీల్స్ బ్యానర్ లో ఈయన సినిమాను చేయబోతున్నాడు. చైతూ 20వ చిత్రంగా రూపొందబోతున్న ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇటీవలే వచ్చింది.

వెంకీమామ చిత్రంతో ఇటీవలే వచ్చిన నాగచైతన్య వచ్చే నెల నుండే పరుశురామ్ దర్శకత్వంలో రూపొందబోతున్న మూవీ షూటింగ్ లో జాయిన్ అవ్వబోతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాలో హీరోయిన్ గా సమంత నటించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. గీత గోవిందం వంటి విభిన్నమైన ప్రేమ కథతో రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా దర్శకుడు పరశురామ్ ఈ సినిమాను తీర్చిదిద్దబోతున్నాడు. దర్శకుడు చెప్పిన స్టోరీ లైన్ నచ్చడంతో సమంత ఓకే అన్నట్లుగా సమాచారం అందుతోంది.

చైతూతో కలిసి సమంత ఈ ఏడాది మజిలీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఇద్దరు కలిసి నటిస్తే ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. 2020లో కూడా మరో సినిమాతో రావాలనే ఉద్దేశ్యంతో ఈ అక్కినేని కపుల్ పరశురామ్ దర్శకత్వంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం అందుతోంది. నాగచైతన్యతో సమంత అనే విషయమై చిత్ర యూనిట్ సభ్యుల నుండి క్లారిటీ రావాల్సి ఉంది. షూటింగ్ ప్రారంభం సమయంకు హీరోయిన్ విషయమై పరశురామ్ క్లారిటీ ఇస్తాడేమో చూడాలి. చైతూ మరియు సమంత కలిసి నటిస్తే మరో గీత గోవిందం అవ్వడం ఖాయం అంటూ అక్కినేని అభిమానులు ఆశ పడుతున్నారు.
Please Read Disclaimer