యంగ్‌ హీరోయిన్‌కు హార్ట్‌ ఎటాక్‌.. పరిస్థితి అత్యంత విషమం

0

పలు తెలుగు, హిందీ సినిమాల్లో నటించిన మోడల్‌ గెహనా వశీష్ట (31) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆమెకు గుండె పోటు రావటంతో ఆసుపత్రిలో జాయిన్‌ చేశారు. సరైన నూట్రిషనల్‌ డైట్‌ తీసుకోకుండా సుధీర్ఘంగా సెట్స్‌లో పనిచేయటం వల్లే ఈ పరిస్థితి వచ్చినట్టుగా డాక్టర్లు చెపుతున్నారు.

విషమంగా గెహనా ఆరోగ్యం

గురువారం ఆసుపత్రిలో చేరిన గెహనా పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టుగా డాక్టర్లు వెల్లడించారు. ప్రస్తుతం గెహనా వశీష్టకు వెంటిలెటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. ముంబై మలాడ్‌ ప్రాంతంలోని రక్ష హాస్పిటల్‌లో ఆమెకు చికిత్స జరుగుతోంది. ఆసుపత్రి వర్గాలు అందించిన సమాచారం ప్రకారం 31 ఏళ్ల గెహనా గుండె పోటుతో పాటు లో బీపీ కారణంగా అనారోగ్యానికి గురైనట్టుగా తెలుస్తోంది. డయాబెటీస్‌ ఉండటంతో అందుకు సంబంధించిన మెడిసిన్స్‌తో పాటు కొన్ని ఎనర్జీ డ్రింక్స్‌ తీసుకోవటం వల్ల ఈ పరిస్థితి వచ్చి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

వెంటిలేటర్‌పై చికిత్స

గురువారం మధ్యాహ్న సమయంలో ఓ వెబ్‌ సిరీస్‌ కోసం మద్‌ ఐలాండ్‌లో షూటింగ్ చేస్తుండగా గెహనా స్పృహ తప్పి పడిపోయ్యింది. వెంటనే స్పందించిన యూనిట్‌ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి చేరే సమయానికి ఆమె పల్స్‌ పూర్తిగా ఆగిపోయినట్టుగా డాక్టర్లు వెల్లడించారు. ఎలక్ట్రిక్‌ షాక్‌ ట్రీట్‌మెంట్‌ ఇచ్చి ప్రయత్నించగా రెండు గంటల తరువాత తిరిగి నాడి కొట్టుకోవటం ప్రారంభమైందని తెలిపారు. అంతేకాదు ఆమె శరీరం చికిత్సకు స్పందించటం లేదని, శ్వాస కూడా తీసుకోలేకపోతుందని తెలిపారు. ఆమెకు వెంటిలేటర్‌ మీద చికిత్స అందిస్తున్నామన్న ఆసుపత్రి వర్గాలు ప్రస్తుతం పరిస్ధితి అత్యంత విషయంగా ఉందని వెల్లడించారు.

తెలుగు సినిమాల్లోనూ నటించిన గెహనా

ఆమె కెరీర్‌ విషయానికి వస్తే.. పలు టీవీ సీరియల్స్‌, వెబ్‌ సిరీస్‌లలో నటిస్తున్న గెహనా సోషల్ మీడియాలో హాట్ ఫోటోలతో హల్‌ చల్‌ చేస్తుంటారు. నటిగా కన్నా మోడల్‌గానే ఈమెకు ఎక్కువ పేరుంది. గతంలో న్యూడ్‌ ఫోటోలతో హల్‌చల్‌ చేసిన ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటో షూట్‌లను రిలీజ్‌ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటుంది. తెలుగులోను పలు చిత్రాల్లో నటించింది గెహనా. కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా నటించటంతో పాటు ఐటమ్‌ సాంగ్స్‌లోనూ అలరించింది.
Please Read Disclaimer