బిగ్ బాస్ 4 లో హాట్ అరియానా కన్ఫర్మ్

0

తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 మరి కొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే నాగార్జున పై ప్రోమో చిత్రీకరించి విడుదల చేయడం జరిగింది. కంటెస్టెంట్స్ విషయంలో తుది నిర్ణయం కూడా అయిపోయిందట. ఒకటి రెండు రోజుల్లో వారికి కరోనా పరీక్షలు నిర్వహించి ఐసోలేషన్ చేసి మళ్లీ షో ప్రారంభం రోజు కరోనా పరీక్షలు నిర్వహించి అప్పుడు షో ను ప్రారంభిస్తారని అంటున్నారు. ఇప్పటి వరకు ఎంతో మంది స్టార్స్ పేర్లు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అంటూ వినిపించాయి. తాజాగా మరో పేరు ప్రముఖంగా వినిపిస్తుంది.

జెమిని కామెడీ ఛానెల్ ప్రేక్షకుకు సుపరిచితురాలు అయిన అరియానా గ్లోరీ ఈసారి బిగ్ బాస్ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈమె సమయస్ఫూర్తితో వేసే పంచ్ లు మరియు ఆకట్టుకునే డైలాగ్స్ బిగ్ ఆఫర్ ను తెచ్చి పెట్టాయట. ఇప్పటి వరకు జెమిని కామెడీ ప్రేక్షకులకు మాత్రమే తెలిసిన ఈమె ఇకపై బిగ్ బాస్ తో తెలుగు ప్రేక్షకులందరికి కూడా దగ్గర అవ్వబోతుంది. కామెడీ షో లో హాట్ హాట్ గా కనిపిస్తూ సోషల్ మీడియాలో కూడా రెగ్యులర్ గా హాట్ పోస్ట్ లు చేసే అరియానా ఖచ్చితంగా బిగ్ బాస్ లో ఎనర్జిని నింపుతుందని అంతా నమ్ముతున్నారు.

ప్రముఖులు ఈసారి బిగ్ బాస్ లో ఉంటారని ఎంటర్ టైన్ చేయడమే లక్ష్యంగా హాట్ ముద్దుగుమ్మలను ఈసారి ఎక్కువగా రంగంలోకి దించుతున్నారు. గత సీజన్ ల మాదిరిగా ఈసీజన్ లో కూడా ఒక లవ్ ట్రాక్ నడిపించే విధంగా బిగ్ బాస్ టీం స్కెచ్ వేస్తుందట. కరోనా పరిస్థితుల్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ లో పలు ఆసక్తికర మార్పులను చూడబోతున్నామట. నిర్వాహకులు ఈసారి షో ఫార్మట్ ను చాలా విధాలుగా మార్చి ప్రసారం చేయబోతున్నారు. నాగార్జున హోస్ట్ గా వ్యవహరించబోతున్న ఈ షో ప్రసార తేదీపై ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.