జార్జ్ రెడ్డి బ్యూటీ థై ఎగ్జిబిషన్

0

`జార్జ్ రెడ్డి` చిత్రంతో దిల్లీ మోడల్ ముస్కాన్ చందానీ తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఆ సినిమా ఆశించినంత విజయం సాధించకపోయినా ముస్కాన్ కి మాత్రం కావాల్సినంత ఐడెంటిటీ దక్కింది. ఈ టాప్ మోడల్ కం నటి తనదైన క్యూట్ లుక్స్.. చక్కని ఆహార్యంతో యూత్ ని మురిపించింది. నటించింది ఒకే ఒక్క సినిమానే అయినా ముస్కాన్ చందానీ కి మాత్రం యువతరంలో అదిరిపోయే ఫాలోయింగ్ వచ్చింది. ఈ భామ బుల్లెట్ సాంగ్ లో చేసిన స్టెప్స్ కుర్రకారును ఆకట్టుకున్నాయి.

ప్రస్తుతం ఇతర భామలకు ధీటైన పోటీనిచ్చేందుకు ముస్కాన్ ప్రయత్నిస్తోంది. టాలీవుడ్ సహా అన్ని పరిశ్రమల్లోనూ తనని తాను ఫోకస్ చేసుకునే పనిలో ఉంది. ఆ క్రమంలోనే తాజాగా లేటెస్ట్ ఫోటో షూట్ తో అదరగొడుతోంది. ఇండస్ట్రీ టాప్ బ్యూటీస్ కి ఏమాత్రం తగ్గని అందం ముస్కాన్ సొంతం. పైగా వైట్ అండ్ వైట్ డిజైనర్ డ్రెస్ లో కనిపించిన ముస్కాన్.. అంతకుమించి థై షోస్ తో అదరగట్టింది. ప్రస్తుతం ఈ ఫోటోలు యూత్ సామాజిక మాధ్యమాల్లో జోరుగా వైరల్ అవుతున్నాయి.

ఇదే క్రమంలో ప్రస్తుతం ముస్కాన్ తెలుగులో స్క్రిప్టులు వింటోందట. బాలీవుడ్ లో ఇప్పటికే కాంచన రీమేక్ మూవీకి ముస్కాన్ సంతకం చేసింది. అందులో అక్షయ్ కుమార్ కథానాయకుడిగా నటిస్తుండగా రాఘవ లారెన్స్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.
Please Read Disclaimer