బాలీవుడ్ ఛాన్స్ కొట్టేసిన ‘జార్జ్ రెడ్డి’ బ్యూటీ

0

ఈమద్య కాలంలో సోషల్ మీడియాలో జార్జ్ రెడ్డి చిత్రం గురించి చాలా ఎక్కువ ప్రచారం జరిగిన విషయం తెల్సిందే. విడుదలకు ముందు చాలా హడావుడి చేసిన జార్జ్ రెడ్డి విడుదల తర్వాత ఎక్కువ రోజులు సందడి చేయలేక పోయింది. సినిమా అంతంత మాత్రంగానే ఆడినా కూడా ఆ చిత్రంలో హీరోయిన్ గా నటించిన ముస్కాన్ ఖుబ్చందానికి మంచి గుర్తింపు దక్కింది. పాత సినిమాల్లో హీరోయిన్ తరహాలో మేకప్ తో ఆమె కనిపించిన సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

జార్జ్ రెడ్డితో మంచి పేరు దక్కించుకున్న ఈ అమ్మడికి ఇప్పుడు బాలీవుడ్ లో ఛాన్స్ దక్కింది. కాంచన సినిమాను రాఘవ లారెన్స్ ప్రస్తుతం హిందీలో లక్ష్మీ బాంబ్ అంటూ రీమేక్ చేస్తున్నాడు. అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తుంది. ఇక మరో కీలక పాత్రలో ఈ అమ్మడు నటిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈమెను జార్జ్ రెడ్డి సినిమా వీడియోల్లో చూసిన లారెన్స్ వెంటనే తన లక్ష్మీ బాంబ్ సినిమాలోని ఒక పాత్రకు ఎంపిక చేసినట్లుగా సమాచారం అందుతోంది.

తెలుగులో కూడా ఈమెకు చిన్నా చితకా ఆఫర్లు వస్తున్నాయి. నటనలో మంచి ప్రావిణ్యం ఉండటంతో పాటు ఈ అమ్మడి అందం కూడా ఆకట్టుకునే విధంగా ఉండటం వల్ల తెలుగులో కూడా మంచి హీరోయిన్ గా పేరు దక్కించుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది. ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఈ మోడల్ కమ్ హీరోయిన్ ముందు ముందు ఎలాంటి సినిమాల్లో చేయనుందో చూడాలి.
Please Read Disclaimer