పీకే హ్యాండివ్వడం వల్లనే వాయిదా?

0

`జార్జి రెడ్డి` చిత్రబృందం ప్రచారార్భాటం చూస్తున్నదే. రెండు మూడు రోజులుగా మీడియాలో ఇదే చర్చ. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అతిథిగా విచ్చేస్తున్నాడని ప్రచారమైంది. అటుపై జార్జిరెడ్డితో పవన్ కనెక్షన్ పై మరెన్నో రూమర్లు వైరల్ అయ్యాయి. తాజా సన్నివేశం బట్టి చూస్తుంటే జార్జిరెడ్డి యూనిట్ ఉచిత ప్రచారం కోసం ఇలాంటి గేమ్ ఆడిందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బహిరంగంగా జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ అతిథిగా వస్తే…ఆయన వెంట భారీగా అభిమానులు తరలి వస్తారని భావించారు.

దీంతో భద్రతా సమస్యతో పాటు.. సామాన్య ప్రజానికానికి ఇబ్బందులు ఎదురవుతాయని పోలీసులు అనుమతికి నిరాకరించినట్లు వార్తలొచ్చాయి. అయితే దీని వెనుక అసలు కథ వేరే ఉందని తాజాగా వెలుగులో వచ్చింది. పవన్ కళ్యాణ్ పేరును జార్జిరెడ్డి ప్రచారం కోసమే వాడుకున్నట్లు ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తోంది. నిత్యం రాజకీయాలతో.. ప్రజా సమస్యలతో బిజీగా ఉండే పవన్ జార్జిరెడ్డి ఈవెంట్ కోసం సమయం కేటాయించే పరిస్థితి ఉందా? అన్న సందేహం నెలకొంది. పవన్ కళ్యాణ్ అతిధిగా వెళ్లకపోవడంతోనే జార్జిరెడ్డి ప్రీ రిలీజ్ వెంట్ ప్రకటించిన వేదిక వద్ద జరపకుండా వాయిదా చేశారని అంటున్నారు.

ఇక హైదరాబాద్ జేఆర్ సీ కన్వెన్షన్ సెంటర్లో వాయిదా పడిన ఈవెంట్ జరగనుంది. అక్కడకి పవన్ కళ్యాణ్ వస్తారని ప్రచారం అవుతున్నా.. ఆయన హాజరయ్యే అవకాశాలు లేవని గుసగుసలు వినిపిస్తున్నాయి. అదే గనుక జరిగితే ఇదంతా పబ్లిసిటీ కోసం జార్జిరెడ్డి యూనిట్ వేసిన ఎత్తుగడ అని తేలిపోయినట్టే. మరి ఈవెంట్ కి పవన్ వస్తున్నారా లేదా? బయట సాగుతున్న ప్రచారంలో వాస్తవం ఏమిటి అన్నది తేలాలంటే ఇంకా కొన్ని గంటలు వేచి చూడాల్సిందే.
Please Read Disclaimer