యోగాతో హీటెక్కిస్తున్న హాటీ నాటీ గాళ్స్

0

సెలబ్రిటీల ఇళ్లలో దీపావళి సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఒక్కో ఫోటో.. ఒక్కో వీడియో హీట్ పెంచుతున్న సంగతి తెలిసిందే. తెలుగు లోగిళ్లలో ఎంతో ట్రెడిషనల్ గా దీపావళిని జరుపుకోగా అటు బాలీవుడ్ లోనూ ఇంచుమించు ఇదే తీరుగా సాంప్రదాయాన్ని ఫాలో అయ్యారు. దీపావళి సందడి ముగిసింది.

అన్ని సెలబ్రేషన్స్ ముగించుకున్న తర్వాత తిరిగి పాత వ్యాపకాల్లోకి వచ్చేసిన సెలబ్స్ రెగ్యులర్ యోగా జిమ్ అంటూ బిజీ బిజీ అయిపోయారు. ఇక బాలీవుడ్ సింగర్ కం నటి సోఫీ చౌదరి ప్రస్తుతం పలువురు కథానాయికలతో కలిసి టిక్ టాక్ యోగా షో.. ఫిట్నెష్ షోతో అదరగొడుతోంది. ఇప్పటికే ఈ భామ తన సామాజిక మాధ్యమాల్లో పలువురు సెలబ్రిటీలతో కలిసి యోగా ప్రాక్టీస్ చేస్తున్న వీడియోల్ని పోస్ట్ చేసి ప్రచారం చేస్తోంది.

అందాల కథానాయిక రకుల్ ప్రీత్ సహా మలైకా అరోరాఖాన్ లాంటి హాట్ గాళ్స్ తో ఈ వీడియోలు రూపొందించి ఇప్పటికే ప్రచారం హోరెత్తించేస్తోంది. సరికొత్త యోగా ఫీట్స్ కి సంబంధించిన ఫొటోలు.. వీడియోలను సోఫీ చౌదరి తన ఇన్గ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. వర్కౌట్ సూట్స్ లో ఈ డ్యూయో బేబీస్ పిచ్చ హాట్ గా వేడెక్కిస్తున్నారు. ముఖ్యంగా రకుల్- సోఫీ వెనక్కి తిరిగి ఒకరిని ఒకరు రాసుకుంటూ చేసే వర్కౌట్ హీటెక్కించింది. ఇక మలైకాతోనూ సోఫీ వర్కవుట్లు మంటలు పుట్టిస్తున్నాయి.

లవ్ యు మల్లా (మలైకా).. థాంక్యూ.. నా షోకి వచ్చినందుకు అమేజింగ్ అనిపించింది. నీకు సంబంధించిన కొన్ని సీక్రెట్స్ ని షేర్ చేసుకున్నావు.. అంటూ సోఫీ ఆనందం వ్యక్తం చేసింది. తనతో పాటు యోగా సెషన్స్ లో పాల్గొన్న రకుల్ కి కృతజ్ఞతలు తెలిపింది. ఇక ఇదే సిరీస్ లో పలువురు టాప్ బ్యూటీస్ తో సోఫీ యోగా ఫిట్ నెస్ వీడియోలు చేసి షేర్ చేయనుందని తెలుస్తోంది.
Please Read Disclaimer