నాగబాబు బ్యాక్ టు జబర్దస్త్: గుట్టు విప్పిన గెటప్ శ్రీను

0

అదేంటి?? జబర్దస్త్ షో నుండి బయటకు వచ్చిన తరువాత నాగబాబు ఆ షో నిర్వాహకుల్ని, ఈటీవీ యాజమాన్యాన్ని ఏకిపారేస్తూ వరుస వీడియోలను హాట్ టాపిక్ అయ్యారు. ‘జబర్దస్త్’ నుండి ‘అదిరింది’ షోకి జడ్జిగా వెళ్లిన నాగబాబు.. మా సత్తా ఏంటో చూపిస్తాం.. కామెడీ ఎవడబ్బ సొత్తు కాదు.. అసలు ఆట ఇప్పుడే మొదలైంది అంటూ జబర్దస్త్ షో నిర్వాహకుల్ని రెచ్చగొడుతూ.. త్వరలో జబర్దస్త్‌కి పోటీగా గురు, శుక్రవారాల్లో అదిరింది షోని ప్రసారం చేస్తామని సవాల్ చేశారు.

బెడిసి కొట్టిన నాగబాబ నిర్ణయం..

అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈపాటికి ఏ ఎంపీగానో.. ఎమ్మెల్యేగానో సెటిల్ అయ్యి.. రాజకీయాల్లో చక్రం తిప్పేవారు నాగబాబు. అటు రాజకీయాల్లోనే కాదు ఇటు బుల్లితెరపైన నాగబాబుకి ప్రతికూల పరిస్థితులు ఎదురౌతున్నాయి. ఏడేళ్లు పాటు జబర్దస్త్ జడ్జిగా వ్యవహరించి.. నవ్వుల నవాబుగా పేరొందిన నాగబాబు.. ఈటీవీ నుండి బయటకు వచ్చి జీ తెలుగులో ‘అదిరింది’ మొదలు పెట్టారు.

‘అదిరింది’ షోని బెదరగొట్టిన రేటింగ్స్

కాగా కామెడీ ఎవరు చేసినా చూస్తారు.. ఎక్కడ చేసినా చూస్తారనే నాగబాబు లెక్క తప్పి.. అదిరింది షోకి దారుణమైన రేటింగ్స్ వచ్చాయి. బార్క్ రేటింగ్స్‌లో జీ తెలుగు ప్రసారాల్లో టాప్ 30లో కూడా ‘అదిరింది’ కామెడీ షోకి స్థానం దక్కలేదు. జీ తెలుగు రేటింగ్ లిస్ట్‌లో చివరన ఉన్న ‘రామసక్కని సీత’ను ‘అదిరింది’షో దాటకపోగా.. కేవలం 3.30 రేటింగ్‌తో సరిపెట్టుకుంది. ఇక జబర్దస్త్ 7.26 రేటింగ్‌తో సత్తా చాటింది.

అదే కామెడీ.. అవే ముఖాలు.. కొత్తదనం ఎక్కడ బాస్

సరే ఈ రేటింగ్‌లు వారం వారం మారుతుంటాయి కాబట్టి.. పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదనుకుంటే.. కాన్సెప్ట్ పరంగానూ నాగబాబు ‘అదిరింది’ వీక్‌గానే ఉంది. సేమ్ టు సేమ్ జబర్దస్త్ చూసినట్టుగానే ఉండటం.. జబర్దస్త్ నుండి వెళ్లిపోయిన ఆ పాత ముఖాలు వేణు, ధనరాజ్‌, కిర్రాక్ ఆర్పీలు షోకి ఫ్రెష్ లుక్ తీసుకురాలేకపోతున్నారు.

నాగబాబు ప్రియ శిష్యుడు గెటప్ శీను ఆసక్తికర కామెంట్స్..

మొత్తానికి ఒకవారం కాకపోతే.. రెండో వారమైనా ఈ రేటింగ్స్‌లో ‘అదిరింది’ దూకుడు చూపించకపోవడంతో నాగబాబు మళ్లీ జబర్దస్త్‌కి తిరిగి వస్తారనే ప్రచారం గత కొన్నాళ్లుగా జరుగుతోంది. రోజా-నాగబాబు కాంబినేషన్‌కి బయట మంచి క్రేజ్ ఉండటంతో జబర్దస్త్‌కి నాగబాబు వస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న సందర్భంలో జబర్దస్త్ కమెడియన్, నాగబాబు ప్రియ శిష్యుడు గెటప్ శీను ఆసక్తికర కామెంట్స్ చేశారు.

జోరు మీద ఉన్న గెటప్ శీను.. వరుస సినిమాలు

గెటప్ శీను, సుడిగాలి సుధీర్, ఆటో రాం ప్రసాద్ హీరోలుగా నటిస్తున్న ‘3 మంకీస్’ మూవీ ట్రైలర్‌ను ఆదివారం నాడు విడుదల చేశారు. ఈ మూవీతో పాటు ‘డబ్ స్మాష్’ చిత్రంలో కీలకపాత్ర పోషిస్తున్నారు గెటప్ శీను. ఈ మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న గెటప్ శీను ‘జబర్దస్త్’ కామెడీ షోని ఉద్దేశించి నాగబాబు రీ ఎంట్రీ త్వరలో ఉండబోతుందంటూ షాకింగ్ ప్రకటన చేశారు గెటప్ శీను.

దారులు వేరైనా మాది ‘జబర్దస్త్’ కుటుంబం

గెటప్ శీను, సుడిగాలి సుధీర్, ఆటో రాం ప్రసాద్ హీరోలుగా నటిస్తున్న ‘3 మంకీస్’ మూవీ ట్రైలర్‌ను ఆదివారం నాడు విడుదల చేశారు. ఈ మూవీతో పాటు ‘డబ్ స్మాష్’ చిత్రంలో కీలకపాత్ర పోషిస్తున్నారు గెటప్ శీను. ఈ మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న గెటప్ శీను ‘జబర్దస్త్’ కామెడీ షోని ఉద్దేశించి నాగబాబు రీ ఎంట్రీ త్వరలో ఉండబోతుందంటూ షాకింగ్ ప్రకటన చేశారు గెటప్ శీను.

​నాగబాబు జబర్దస్త్‌కి తిరిగి వస్తున్నారు: గెటప్ శీను

ప్రస్తుతం నాగబాబు గారు ‘అదిరింది’ షోకి జడ్జ్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే త్వరలో తప్పకుండా జబర్దస్త్‌కి తిరిగి వస్తారు. అదిరింది, జబర్దస్త్ వేరు వేరు ప్లాట్ ఫామ్స్ అయినా అందులో చేసేవాళ్లంతా ఒక కుటుంబంగానే ఉన్నాం. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు. కాకపోతే నాగబాబు గారు జబర్దస్త్ షోకి తిరిగి వస్తే మాకు ఇంకా ఎనర్జీ పెరుగుతుంది’ అంటూ చెప్పుకొచ్చారు గెటప్ శీను.
Please Read Disclaimer