రాంగోపాల్ వర్మకు షాకిచ్చిన జీహెచ్ఎంసీ

0

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మకు జీహెచ్ఎంసీ షాక్ ఇచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా వేసిన పోస్టర్ కు సంబంధించి రూ.4వేల రూపాయల పెనాల్టీని విధించింది.

లాక్ డౌన్ తర్వాత మొదటి పోస్టర్ గా పేర్కొంటూ ‘పవర్ స్టార్’ సినిమాకు సంబంధించి రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్ ను ప్రస్తావిస్తూ పోస్టర్ వేశారు. ఇటీవల తను తీసిన ఈ సినిమాను ఆన్ లైన్ లో రిలీజ్ చేశారు. ఆ సినిమా ప్రచారంలో భాగంగానే హైదరాబాద్ లో ఈ సినిమా పోస్టర్ వేసినట్టు సమాచారం.

ఈ సినిమాను ప్రమోట్ చేసేందుకు ప్రభుత్వ ఆస్తిని వినియోగించినందుకు ఓ పౌరుడు జీహెచ్ఎంసీ ఈవీడీఎం విభాగానికి ఫిర్యాదు చేశారు.

స్పందించిన ఈవీడీఎం విభాగం ఈనెల 22న రాంగోపాల్ వర్మకు ప్రభుత్వం ఆస్తుల్లో పోస్టర్ వేసినందుకు రూ.4వేల పెనాల్టీ వేసి చలానాను జారీ చేసింది.