పెళ్లికళ వచ్చేసిందే పూజా

0

గత కొంతకాలంగా సోషల్ మీడియాల్లో పూజా హెగ్డే స్పీడ్ చూస్తుంటే ఆశ్చర్యం కలగక మానదు. విశ్రాంతి అన్నదే లేకుండా రెగ్యులర్ గా అక్కడ కొత్త ఫోటోషూట్లతో విరుచుకుపడుతోంది. ఎప్పటికప్పుడు మ్యాగజైన్ కవర్ షూట్లకు లెక్కే లేదు. ఓవైపు సినిమాలతో బిజీగా ఉన్నా మరోవైపు ఫోటోషూట్లు వదిలిపెట్టడం లేదు.

తాజాగా ప్రఖ్యాత వెడ్డింగ్ వోస్ మ్యాగజైన్ డిసెంబర్ కవర్ పేజీకి ఫోజులిచ్చింది. ఎథ్నిక్ డిజైనర్ వేర్.. మోడ్రన్ లెహెంగాలో తళుక్కున మెరిసింది. పూజా బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా పర్ఫెక్ట్ వెడ్డింగ్ డిజైన్ ఇది అనడంలో అతిశయోక్తి కాదు. హాఫ్ షోల్డర్ లుక్ లో గోల్డెన్ డిజైనర్ లెహెంగా చోళీ సెట్ ని ధరించింది. మిక్స్ డ్ డార్క్ నాచు కలర్ డ్రెస్ తో ఆకట్టుకుంది. ఆ డ్రెస్ కి తగ్గట్టే పూజా ఇచ్చిన సింపుల్ ఫోజు ఆకర్షణీయంగా కనిపిస్తోంది.

కెరీర్ పరంగా పరిశీలిస్తే.. పూజా ఇప్పటికిప్పుడు ప్రభాస్ సరసన `జాన్` చిత్రీకరణకు రెడీ అవుతోంది. అలాగే బన్ని సరసన `అల వైకుంఠపురములో` చిత్రంలో నటించింది. ఈ చిత్రం సంక్రాంతికి రిలీజ్ కానుంది. అఖిల్ సరసన ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
Please Read Disclaimer