కిక్కిచ్చే గ్లాస్ మేట్సు – లిరికల్ వీడియో

0

సుప్రీమ్ హీరో సాయి ధరం తేజ్ హీరోగా తిరుమల కిషోర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రలహరిలో రెండో ఆడియో సింగల్ విడుదలైంది. మొన్నటి నుంచే ప్రమోషన్ లో ఇది మందు తాగే స్నేహితుల పాటగా ప్రమోట్ చేయడంతో అంచనాలు బాగానే నెలకొన్నాయి. ఇక పాట విషయానికి వస్తే దేవి శ్రీ ప్రసాద్ సిగ్నేచర్ స్టైల్ లో ఇన్స్ టాంట్ గా కిక్కిచ్చేలా ఉంది.

పదాలతో చంద్రబోస్ చెడుగుడు ఆడేయడంతో ఇకపై బార్లలో ఇది మారుమ్రోగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. క్లాస్ మేట్స్ సోల్ మేట్స్ రూమ్ మేట్స్ ఇలా అందరికి ఎక్కడో చోట ఫుల్ స్టాప్ ఉంటుందని ఏ ఎండు లేని వాడు మందు పంచుకునే గ్లాస్ మెట్ అని అర్థం వచ్చేలా ఉన్న ట్యూన్ చాలా క్యాచీగా ఆకట్టుకునేలా ఉంది.

రాహుల్-పెంచల్ దాస్-దేవిల గాత్రాలతో సరదాగా సాగిన ఈ పాట గబ్బర్ సింగ్ లో మందుబాబులం రేంజ్ లో లేకపోయినా దీని ప్రత్యేకత వేరుగా ఉంది. చిత్రలహరికి దేవి మ్యూజిక్ ఎంత ఆకర్షణగా నిలవనుందో దీని ద్వారా అర్థమవుతోంది. ఈ పాటలోనే సునీల్ తో కలిసి సాయి ధరం తేజ్ బార్ లో చేసే అల్లరి ఓ రేంజ్ లో ఉంటుందట.

హీరొయిన్ల ప్రస్తావన లేకుండా కేవలం మందు స్నేహితుల చుట్టూ రాసుకున్న ఈ లిరికల్ వీడియోలో ఎక్కువ విజువల్స్ రివీల్ చేయకుండా జాగ్రత్త పడ్డారు. కళ్యాణి ప్రియదర్శన్-నివేత పెతురాజ్ హీరొయిన్లుగా నటిస్తున్న చిత్రలహరి వచ్చే నెల 12న విడుదల కానుంది. రంగస్థలం తర్వాత మెగా హీరోతో మైత్రి సంస్థ నిర్మించిన మూవీ కావడంతో అంచనాలు భాగానే ఉన్నాయి
Please Read Disclaimer