కన్ఫ్యూజ్ చేసి కొడుతున్న గోవా బ్యూటీ

0

గోవా భామ ఇలియానా డీక్రజ్ చాలా రోజులుగా వార్తల్లో వ్యక్తిగా మారిన సంగతి తెలిసిందే. పోయినేడాది.. ఆ ముందు ఏడాది తన ఆస్ట్రేలియన్ బాయ్ ఫ్రెండ్ ఆండ్రూ నీబోన్ తో ప్రేమాయణంతో వార్తల్లో నిలిచిన ఇల్లీ ఆ తర్వాత బ్రేకప్ తో వార్తల్లో నిలిచింది. ఈ మధ్యేమో వరసగా బికినీ ఫోటోలతో సోషల్ మీడియాను మోతెక్కిస్తోంది. ఈ ఫోటోలను చూస్తున్నవారు ఇల్లీ స్లిమ్ అవతారం చూసి షేక్ అవుతున్నారు.

అయితే ఈ ఫోటోలు లేటెస్టువా కదా అనే విషయంపై సోషల్ మీడియాలో తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఇల్లీ తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసే ఫోటోలలో దాదాపుగా జీరో సైజ్ లో ఉంది. కానీ ఇల్లీ ఏదైనా ఫిల్మీ ఈవెంట్లలో… లేదా ఎయిర్ పోర్ట్ దగ్గర కనిపించిన సమయంలో మాత్రం మరీ అంత స్లిమ్ గా కనిపించడం లేదు. దీంతో ఇలియానా తన పాత ఫోటోలను పోస్ట్ చేస్తూ తెలివిగా ఇవే కొత్తవి అన్నట్టుగా నెటిజన్లను నమ్మించేప్రయత్నం చేస్తోందనే వాదన వినిపిస్తోంది.

బ్రేకప్ విషయంలో ఎమోషనల్ గా డిస్టర్బ్ అయిన ఇలియానా జిమ్ కు రెగ్యులర్ గా వెళ్ళకపోవడంతో షేప్ అవుట్ అయిందని.. అయితే బ్రేకప్ తర్వాత మాత్రం రెగ్యులర్ గా జిమ్ కు వెళ్తూ మునుపటి రూపంలోకి వచ్చేందుకు విశ్వప్రయత్నం చేస్తోందని సమాచారం. అంతలోపు కొత్త ఫోటోలు పోస్ట్ చేయకుండా పాత ఫోటోలతో నెట్టుకొస్తోందని అంటున్నారు. సహజంగా సెలబ్రిటీలు ఎవరైనా పాత ఫోటోలు పోస్ట్ చేసే సమయంలో #throwback అంటూ స్పష్టంగా వెల్లడిస్తారు. అయితే ఇలియానా మాత్రం పాత ఫోటోలనే కొత్త ఫోటోల లాగా పోస్ట్ చేస్తోంది. ఆ ఫోటోలతో పాటు కొత్త ఫోటోలలో సెలెక్టివ్ గా కొన్నిటినే పోస్ట్ చేస్తోంది. దీంతో ఏవి కొత్తవో ఏవి పాతవో తెలుసుకోవడం కష్టంగా మారింది.
Please Read Disclaimer