రంగస్థలం లో ‘గొల్లభామ’ పోయింది..

0రామ్ చరణ్ , సమంత జంటగా సుకుమార్ దర్శకత్వం లో తెరకెక్కిన మూవీ రంగస్థలం. పక్క మాస్ ఫిలిం గా రాబోతున్న ఈ మూవీ ఫై మెగా అభిమానుల్లోనే కాదు యావత్ సినీ ప్రేక్షకుల్లో అంచనాలు తారాస్థాయి లో ఉన్నాయి. ఆ అంచనాలు రెట్టింపు చేసే విధంగా దేవి శ్రీ మ్యూజిక్ ఉండడం తో సినిమా ఖచ్చితం గా హిట్ అని అంత ఫిక్స్ అయ్యారు. తాజాగా రంగస్థలం సినిమాకు ఓ వివాదం చుట్టుముట్టిన సంగతి తెల్సిందే..

రంగమ్మ మంగమ్మ అనే పాటలో గొల్లభామ అనే లైన్ ఓ వర్గాన్ని కించపరిచేలా ఉందని ఆరోపణలు రావడంతో సుకుమార్ రీసెంట్ గా వివరణ కూడా ఇచ్చాడు. అయినాగానీ సదరు వర్గం వారు అభ్యంతరం చెప్పడం తో వివాదాన్ని ఎక్కువ చేసుకోవడం ఇష్టం లేక సుకుమార్ పాటలో గొల్లభామ అనే పదాన్ని తీసేసి సింపుల్ గా గోరువంక అనే పదాన్ని యాడ్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఆడియో లో గొల్లభామ వినిపించిన కానీ సినిమాలో మాత్రం గొల్లభామ బదులు గోరువంక అని వినిపిస్తుంది.