గొల్లపూడి లేకుండానే ఆ వేడుక

0

ప్రముఖ రచయిత.. నటుడు అయిన స్వర్గీయ గొల్లపూడి మారుతిరావు గారు ప్రతి సంవత్సరం తన కుమారుడు స్వర్గీయ గొల్లపూడి శ్రీనివాస్ జ్ఞాపకార్థం జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్న కొత్త దర్శకులకు అవార్డు ఇవ్వడం జరుగుతుంది. చాలా ఏళ్లుగా ఈ అవార్డును గొల్లపూడి కుటుంబ సభ్యులు ఒక ట్రస్ట్ ను ఏర్పాటు చేసి మరీ ఇస్తున్నారు. తారే జమీన్ పర్ సినిమాకు మొదటి సారి దర్శకత్వం వహించిన అమీర్ ఖాన్ కు ఈ అవార్డును ఇవ్వడం జరిగింది.

జాతీయ స్థాయిలో గొల్లపూడి శ్రీనివాస్ అవార్డుకు క్రేజ్ ఉంది. ఎంతో మంది కొత్త దర్శకులు ఈ అవార్డు కోసం పోటీ పడుతూ ఉంటారు. కొన్ని అవార్డుల మాదిరిగా తమకు ఇష్టం వచ్చిన వారికి కాకుండా నిష్ణాతులైన జ్యూరీని ఏర్పాటు చేసి జెన్యూన్ గా గొల్లపూడి మారుతి రావు ఈ అవార్డును ఇవ్వడం జరుగుతుంది. చాలా మందికి ఇవ్వకుండా సంవత్సరంకు ఒక్కరికి మాత్రమే అది కూడా కొత్త దర్శకులకు మాత్రమే ఈ అవార్డును ఇవ్వడం జరుగుతుంది.

2019 సంవత్సరంకు గాను యూరి చిత్ర దర్శకుడు ఆధిత్య నాథ్ ఇంకా మలయాళ చిత్ర దర్శకుడు మధు సి నారాయణన్ లకు ఉమ్మడిగా ఈ అవార్డును ఇవ్వబోతున్నారు. అయితే ఈసారి ఈ అవార్డు వేడుక గొల్లపూడి మారుతి రావు లేకుండా జరుగుతోంది. ఇటీవల ఆనారోగ్య కారణంతో మృతి చెందిన గొల్లపూడి లేకున్నా కూడా ఎలాంటి విఘాతం లేకుండానే అవార్డు వేడుక నిర్వహిస్తున్నారు. ఆయన లేకుండా అవార్డు వేడుక మొదటి సారి జరుగుతుండటంతో కుటుంబ సభ్యులు మరియు ఆయన సన్నిహితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-