‘గుడ్ లక్ సఖి’ మూవీ.. ఓటిటిలో రిలీజ్ కానుందా..??

0

కరోనా మహమ్మారి వలన ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఎన్నో మార్పులు వచ్చాయి. ముఖ్యంగా విడుదలకు సిద్ధమైన సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్న సినిమాల పరిస్థితులు చెప్పక్కర్లేదు. మన టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా సినిమాలు కరోనా కారణంగా వాయిదా పడి వాటి ఊసే లేకుండా పోతున్నాయి. ఇదే మంచి సమయం అని భావిస్తున్న డిజిటల్ థియేటర్లు ఓటిటి ప్లాట్ ఫాములు విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలను కొనేస్తూ ఆన్ లైన్ విడుదల చేసేస్తున్నాయి. అందులో స్టార్ హీరోలు.. హీరోయిన్ల దగ్గర నుండి ప్రతీ ఒక్కరి సినిమాలు వెబ్ సిరీస్లు ఇలా అన్నీ ఓటిటిలో రిలీజ్ అవుతున్నాయి. ప్రస్తుతం సినిమా థియేటర్లు తెరిచే అవకాశం లేకపోవడంతో ఏ దిక్కులేక ఆర్థిక ఇబ్బందుల వలన పలువురు నిర్మాతలు ఓటిటిలకు అమ్మేసుకుంటున్నారు.

ఇటీవలే మహానటి ఫేమ్ కీర్తి సురేష్ నటించిన పెంగ్విన్ సినిమా పరిస్థితి కూడా అంతే అయింది. లాక్ డౌన్ వలన ఆలస్యం చేయకుండా నిర్మాత కార్తీక్ సుబ్బరాజ్ అమెజాన్ ప్రైమ్ కి అమ్మేసి విడుదల చేసాడు. అయితే ఆ సినిమా ఫలితం గురించి పక్కన పెడితే పక్కా థియేటర్లో విడుదల చేద్దామనుకున్న మూవీ ఓటిటి రిలీజ్ అయింది. తాజాగా కీర్తి నటిస్తున్న మరో మూవీ పరిస్థితి కూడా అలాగే కనిపిస్తుందట. పెంగ్విన్ సినిమాకి బ్యాడ్ టాక్ రావడంతో ఓటిటిలు రేట్లు తగ్గించాయని అన్నారు. కానీ ప్రస్తుతం కీర్తి సురేష్ నటిస్తున్న ‘గుడ్ లక్ సఖి’ సినిమా టీజర్ మంచి స్పందన పొందుతోంది. అయితే ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వారు ఈ సినిమాకు 13కోట్ల భారీ ఆఫర్ ఇవ్వనున్నట్లు టాక్. మంచి ఆఫర్ వచ్చిందని అనుకుంటున్న ఈ సినిమా కూడా మాక్సిమం ఓటిటిలోనే విడుదల అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. చూడాలి మరి ‘గుడ్ లక్ సఖి’ డిజిటల్ బాట పడుతుందేమో..!!