రెండు నెలలు గర్భవతి అంటూ!

0

అక్కినేని ఇంట గుడ్ న్యూస్ ఎప్పుడు..? వారసుడిని ఎప్పుడిస్తావు? అంటూ సమంతకు ప్రశ్నలు తప్పడం లేదు. ఎక్కడికి వెళ్లినా ఈ ప్రశ్న రెయిజ్ అవుతోంది. సోషల్ మీడియాలో దీనిపై రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇటీవలే ఓ నెటిజన్ నుంచి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. మీ ఫ్యామిలీలోకి కొత్త మెంబర్ ఎప్పుడొస్తాడు అంటూ ప్రశ్నించడం దానికి సామ్ కాస్త ఘాటైన ఆన్సర్ ఇవ్వడం తెలిసిందే. 7 ఆగస్ట్ 7ఏఎం 2022లో గుడ్ న్యూస్ చెబుతానని సామ్ రుసరుసలాడారు. ఆ ఎపిసోడ్ అయ్యి ఇంకా వారం కూడా పూర్తవ్వలేదు. మళ్లీ సమంత గర్భిణి అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ప్రస్తుత సమంత రెండు నెలల గర్భవతి అని ఓ రూమర్ ప్రచారంలోకి వచ్చింది.

ఈ విషయం సమంత.. చైతన్య.. కుటుంబ సభ్యులకు.. ట్రీట్ చేస్తోన్న డాక్టర్ కు మాత్రమే తెలుసునని ఫిలిం సర్కిల్స్ లో ముచ్చట్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సమంత ఓ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఈ వెబ్ సిరీస్ తర్వాత పూర్తిగా కొన్నాళ్ల పాటు తెరకు కనుమరుగు కానుందని ప్రచారమవుతోంది. జనవరి నుంచి మరో రెండేళ్ల పాటు సినిమాలు చేసే అవకాశం లేదని ప్రచారం సాగుతోంది. డాక్టర్ సూచన మేరకే సమంత రెస్ట్ తీసుకునే సమయం ఆసన్నమైందని అంటున్నారు.

96 రీమేక్ తర్వాత సమంత కొత్త సినిమాలు ఒప్పుకోకపోవడానికి ఇదీ ఓ కారణం అని వినిపించడం ఆసక్తికరంగా మారింది. మరి సమంత ఇటీవల ఇచ్చిన ఘాటు రిప్లై నేపథ్యంలో ఇందులో వాస్తమెంత? అన్నది తెలియాల్సి ఉంది. సమంత -శర్వానంద్ ల 96 త్వరలో రిలీజ్ కానుంది.
Please Read Disclaimer